OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


మానసిక ఆరోగ్యం


ఒత్తిడిఒంటరిగా జీవించడంఆందోళన మరియు ఆతురతగుర్తుంచుకోవడంలో అశ్యకత మరియు చిత్తవైకల్యంవియోగంన్యూట్రిషన్

వినియోగం: ప్రియమైన వారి మరణం

మనం ఎంతగానో ప్రేమించే వారి యొక్క మరణం మన జీవితంలో ఏదోఒక దశలో ఎదుర్కొనాల్సి ఉంటుంది. మరిముఖ్యంగా వృద్ధాప్యంలో ఇది ఎక్కువగా ఉంటుంది.


మీరు ఇప్పటికే మీ తల్లిదండ్రులు,సోదరుడు, సోదరి, భర్త లేదా భార్య,మంచి స్నేహితుడు, లేదా పిల్లలు లేదా మనవలు వంటి వారి మరణం వల్ల బాధపడి ఉండవచ్చు. మీరు మీ జీవితం పంచుకునే వ్యక్తుల మరణం అనేది తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. జీవితం యొక్క తరువాత దశలో ఎన్నో సంవత్సరాలు పాటు కొనసాగిన ప్రేమపూర్వక సంబంధం ముగియడం అనేది ఎంతో విషాదభరితంగా ఉంటుంది.
మీ స్వంతజీవితంలో కూడా అనేక రకాల సమస్యలుంటాయి: మీరు స్వయంగా కదలలేకపోవడం, ఒంటరిగా జీవించాల్సి రావడం, అనార్యోగం, మీ పిల్లల నుంచి మీరు దూరంగా జీవించాల్సి రావడం లేదా ఇంకా ఎలాంటి కుటుంబం లేకపోవడం వంటి సమస్యలు మీకు ఉండవచ్చు.


వినయోగం అనేది తీవ్రమైన వ్యక్తి మరియు దిగ్భాంతికర ఘటన. బాధను కొలవడానికి ఎలాంటి ప్రమాణిక పద్ధతుండవు. మనం మన జీవితంలో వినయోగాన్ని జీవితంలోని ప్రతిసందర్బంలో అనుభవించే ఉంటాం. అయితే విషాధాన్ని గుర్తించే సరళి ఉన్నది. సాధారణంగా ఉండే విషాద దశలు మరియు వీటిని ఎలానివృత్తి చేసుకోవాలన్న విషయాలను మనం ఇప్పుడు చూద్దాం.


మనలో ఉండే భయాలు మనకు తెలియనవి,. వకానీ వ్యక్తులుతాము అనుభవించే బాధను తామే నివృత్థి చేసుకోవాలని అదేవిధంగా ఇటువంటి వినియోగం సహజమన్న భావనలో ఉండాలి. ఇది మనకు ప్రియమైన వారు మరణం కొరకు మనం సిద్ధం కావడాఇనికి సాయపడుతుంది.
వృద్ధాప్యంలో, విషాదాలు మరియు సంతాపం అనేవిజీవితంలోని విషాదానికి కారణం అవుతుంది. ఇప్పుడు అనేక రకాల షాక్‌లతో, మనం విషాదం గురించి ఆలోచించాలి. మామూలుగా మారడానికి మరియు రికవరీ కావడానికి ఇది ఎంతో కీలకంగా మారుతుంది. విషాదం వ్యక్తం చేయడానికి మనకు మనం సమయం కల్పించుకోవాలి, దానికి మనం అవకాశంకల్పించాలి మరియు వారికి సాయం చేసేందుకు అడగాలి. మనలో చాలామంది మతం ద్వారా స్వాంతన పొందుతాం. ఒకవేళ మీరు బలమైన మతపరమైన భావనలు ఉన్నట్లయితే, ఎవరైనా ప్రియమైన వారు మరణించినప్పుడు మీరు మతపరమైన కార్యక్రమాల వైపుకు మీరు మరలినప్పుడు దోహదపడుతుంది.మీరు రెగ్యులర్‌గా దేవారాధన చేయకపోతే, మీరు తాజాగా ప్రారంభించవచ్చు.వ్యక్తిగత విశ్వాసం మరియు ఫిలాసఫీ అనేది మీకు వియోగంలో గొప్ప సౌఖ్యాన్ని అందిస్తుంది.


విషాదం యొక్క ఒత్తిడి అనేది మీపై తీవ్రమైన శారీరక మరియు బావోద్వేగ మార్పులకు కారణం అవుతుంది. ఒత్తిడి వల్ల మనకు ప్రమాదాలకు కూడా గురవుతాం. అందువల్లనే మీ పట్ల మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదనపు విశ్రాంతి, పోషకాహారం, తాజా గాలి మరియు ఎక్స్‌ర్‌సైజులు వంటివి, ఔషధాల కంటే ఎక్కువగా విలువను కల్పిస్తాయి. అయితే మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి నిరంతర బాధించబడుతున్నట్లయితే మీరు తక్షణం వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.


మీ భయాలను పంచుకోండి

మనం వృద్ధులుగా మారుతున్న కొలదీ,మనకు భయాలు పెరుగుతాయి. వినియోగంలో మీరు మీ బాల్యంలో భయాలు, కొత్త భయాలు,చీకట అంటే భయం, తెలియని వస్తువుకు సంబంధించిన భయం, ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయం, ఇంటి పనులు మరియు ఆర్థికాంశాలకు సంబంధించిన భయాలు ఏర్పడతాయి. ప్రియమైన వారిని కోల్పోవడం వల్ల అనేక సంవత్సరాల తరువాత ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. అన్నింటికి మంచి మన స్వంత మరణం అనేది ఎంతగానో భయాన్ని కలిగిస్తుంది. భయాలు నిజమైనవి కానీ వాటిని పంచుకోవచ్చు, మీ కుటుంబం యొక్క మద్దతు మరియు స్నేహితులు వల్ల ఇటువంటి భయాలను దూరం చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.


ప్రేమించిన వారి మరణానికి సిద్ధం కావడం

మరణం గురించి మాట్లాడటం తప్పు విషయం కాదు, కానీ సాధ్యమైనంత వరకు అటు మానసికంగా ఇటు శారీరకంగా దీని గురించి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఏ పనులు ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల కోపం మరియు చిరుకు కలుగుతాయి.రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ఒక్కింత విశ్రాంతి లభిస్తుంది. మీరు ఎంతగానో ఆ విషాదం నుచి బయట పడగలుగుతారు.


మరణం సంభవించినప్పుడు చేయాల్సిన పనులు

మీ ఇంటిలో మరణం సంభవించినప్పుడు, మీ డాక్టరుకు కాల్‌ చేయండి, ఒకవేళ ఈ విషయం పోలీసులకు రిఫర్‌ చేయనట్లయితే మరణాన్ని ధృవీకరిస్తూ మెడికల్‌ సర్టిఫికేట్‌పై సంతకం చేస్తాడు. ఆసుపత్రిలో మరణం సంభవించినట్లయితే డాక్టరు సర్టిఫికేట్‌ జారీ చేస్తాడు,. మెడికల్‌ సర్టిఫికేట్‌ను నిర్ధారిత సమయంలో స్థానికంగా ఉండే జనన మరణాల రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తీసుకొని వెళ్లాలి.


హటాత్తుగా మరణించడం

ఒకవేళ హటాత్తుగా లేదా అసాధారణంగా మరణం సంభవించినట్లయితే పోలీసులకు తెలియజేయడం అనేది మీ డాక్టర్‌ యొక్క విధి. వారు పోస్ట్‌మార్టంకు కాల్‌ చేయవచ్చు మరియు మరణానికి సంబందించిన కారణాన్ని తెలుసుకునేందుకు వారు ఎంక్వైరీ చేయవచ్చు. చాలా సందర్భాల్లో ఇది ఒక సాంకేతికఅంశమే, కనుక పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.


డెత్‌నోటీస్‌

న్యూస్‌పేపర్‌లో మరణం తేదీ,సమయం మరియు దహనం జరిగే ప్రాంతం గురించి మీరు న్యూస్‌ పేపర్‌లో ప్రకటన ఇవ్వవచ్చు. న్యూస్‌ పేపర్‌ విభాగటంలో ఉండే క్లాసిఫైడ్‌ ఎడ్వర్టైజ్‌మెంట్స్‌ విభాగంఈ విషయంలో మీకు సాయం చేయవచ్చు.భద్రత కారణాల దృస్టా, మీరు మీచిరునామాను ఇవ్వకుండా ఉండవచ్చు.


చేయదగినవి మరియు చేయకూడని వాటిని ప్రాక్టీస్‌ చేయండి
  • మరణానికి ఎంతో ముందస్తుగా సిద్ధం కావడానికి ప్రయత్నించవద్దు
  • మీ భావాలను వ్యక్తం చేయండి.మీ భావాలను దాచుకోవడం వల్ల మీకు పెద్దగా లాభం కలగదు. మీ కుటంబంతో, ప్రాణ స్నేహితుడు లేదా సానుభూతి బృందంతో ఏమి జరిగిందనే విషయాన్ని మాట్లాడండి
  • మీ పట్లమీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోండి, సరిగ్గా తినండి మరియు విశ్రాంతి తీసుకోండి.
  • ఇంటిలో ప్రమాదాలు విషయంలో జాగ్రత్తగా ఉండండి మరియు ఇంటిని సురక్షితంగా ఉంచుకోండి.
  • మీ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లయితే మీ వైద్యుడిని సంప్రదించండి.
  • నిర్ణయాలు తీసుకునే విషయంలో మీ కుటుంబం లేదా స్నేహితులు మిమ్ముల్ని హడావిడి పెట్టకుండా చూసుకోండి.
  • మీకు అర్థం కాని ఆర్థిక ఒప్పందాలకు పోవద్దు.
  • ఎక్కువ ఖర్చు ఉండే దహన క్రియలకు అనుమతించవద్దు మాదకద్రవ్యాలు, మద్యం లేదా ఎక్కువగా పొగతాగవద్దు.
  • మీరు ఇంకా విషాదంలో ఉన్నట్లయితే మీరు ఇంటికి మారవద్దు. మారిన పరిస్థితులకు సర్దుబాటు కావడానికి మీకు సమయం పడుతుంది.
  • నయం అయ్యే ప్రక్రియ కోసం హడావిడి పడవద్దు. మీ స్వంత వేగంతో సాగండి.
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.