OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్



ఆరోగ్యకరంగా భుజించడం



ఆరోగ్యకరమైన ఎముకలు



మంచి నిద్ర



మీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం



వృద్ధాప్యంలో మంచి చూపు



ఇమ్యూనైజేషన్



చక్కటి వినికిడి



ఔషధాల నిర్వహణ



పాదాల సంరక్షణ



పడటం మరియు ప్రమాదాలు



మలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

వృద్ధాప్యంలో మంచి చూపు

వయస్సుతోపాటు, మన దృష్టి కూడా నెమ్మదిగా మందగిస్తుంది. 60 సంవత్సరాలు వచ్చే సరికి మనందరం కూడా కళ్లజోళ్లను ఉపయోగిస్తారు. వివిధ రకాల వ్యాధురల వల్ల కూడా వృద్ధాప్యంలో చూపు మందగిస్తుంది. రెగ్యులర్‌గా కంటి పరీక్షలు, సరైన కళ్లజోళ్లు, శస్త్రచికిత్స,ఔషధాలు మరియు ప్రత్యేక విజువల్‌ ఎయిడ్స్‌ వల్ల చాలా మంది చాలా చక్కటి దృష్టిని కలిగి ఉంటారు మరియు మరియు పూర్తిగా స్వతంత్ర జీవితాన్ని గడుపుతారు.


రెగ్యులర్‌ సైట్‌ పరీక్షలు

సైట్‌ పరీక్ష అనేది కేవలం కళ్లజోళ్ల కోసం పరీక్ష కాదు,. కానీ ఒక వ్యక్తి యొక్క కంటి ఆరోగ్యానికి సంబంధించి జరిపే పరీక్ష. ఒకవ్యక్తికి కొత్తగా కంటి వ్యాధి వచ్చినట్లయితే, దాన్ని ఎంతో త్వరగా గుర్తించాల్సి ఉంటుంది. కనుక రెగ్యులర్‌గా కంటి పరీక్షలు జరిపించుకోవాలి. ప్రతి రెండడు సంవత్సరాలకు మరియు కంటి చూపుకు సంబంధించి ఏదైనా సమస్య ఉన్నట్లయితే, తక్షణం పరీక్షలు చేయించుకోవాలని సిఫారసు చేయబడిరది. సైట్‌ టెస్ట్‌ అనేది ఒక ప్రత్యేకమైన టెస్టు మరియు దీన్ని ఆప్తమాలజిస్టుల ద్వారా నిర్వహించబడుతుంది( కంటి సంరక్షణలో నైపుణ్యం పొందిన డాక్టర్లు)లేదా ఆప్టోమెట్రిక్స్‌( ఆప్థాల్మిక్‌ ఆప్టిషియన్లు) చేస్తారు. ఒకవేళ ఈ పరీక్షల్లో ఏదైనా అసాధారణ స్థితి బయటపడినట్లయితే, దానికి చికిత్స ఇంకా పరిశోధన చేయాల్సి ఉంటుంది. మీ కుటుంబ డాక్టరును సంప్రదించడం అనేది ఎంతో ముఖ్యం.


కళ్లజోళ్లు మరియు ఇతర తక్కువ దృష్టి ఉపకరణాలు

ఆర్డర్‌పై తయారు చేసే కళ్లజోళ్లు ఉపయోగించాలని సలహా ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఇవి వారి అవసరాలకు అనుగుణంగా తయారు చేయబడతాయి. ఇప్పుడు రెడీమేడ్‌ రీడిరగ్‌ గ్లాసులు లభ్యమవుతున్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల కంటిని పెద్దగా హాని జరగనప్పటికీ, ఒత్తిడి మరియు తలనొప్పి వస్తాయి. కళ్లజోళ్లన శుభ్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. జోడు యొక్క అదవ్దాలు నేరుగా భూమిని తాకేట్లుగా ఉంచవద్దు. దీని వల్ల కళ్లజోడుపై గీతలు పడతాయి. గీతలు పడ్డ కళ్లజోడు వల్ల బూదరగా కనిపిస్తుంది మరియు స్పష్టమైన చూపు తగ్గుతుంది.

మాగ్నిఫైయర్ల చిన్న వస్తువులను పెద్దవస్తువులుగా మారుస్తాయి, తద్వారా కంటి చూపు సరిగ్గా లేకపోవడం వల్ల క్లిష్టంగా ఉండే పనుల్ని వీటి ద్వారా చేయవచ్చు. సరిపడినంత కాంతి

20 సంవత్సరాల వయస్సు ఉన్నవారితో పోలిస్తే 60 సంవత్సరాల వయస్సు వారి కంటికి అవసరమయ్యేకాంతి మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. సహజ సూర్యకాంతి నేరుగా ఇంటిలోకి ప్రవేశించేవిధంగా చూసుకోవాలి. మెట్ల యొక్క పైన మరియు కింద కూడా విద్యుత్‌ కాంతి సరిపడేలా ఉండేట్లు చూసుకోవాలి. చదవడం లేదా దగ్గరగా ఉండే పనిచేయాల్సి వచ్చినప్పుడు పని లేదా పుస్తకం యొక్క వెనక వైపు నుంచి కాంతి పడేట్లుగా చూసుకోండి. ఫ్లోరోసెంట్‌ దీపాలు ఎంతో సమర్థవంతమైన విఎందుకంటే అవి ఎక్కువ కాంతిని ఇస్తాయి అదే సమయంలో తక్కువ వేడిమిని ఇస్తాయి.


చూపు మరింత తగ్గడానికి కారణాలు

వయోవృద్ధుల్లో చూపు మరింత మందిగించేపరిస్థితికి చేరుకుంటుంది. అటువంటి వారు కళ్లజోడు ధరించినప్పటికి కూడా చూడలేకపోతారు. అవి:


కాటరాక్ట్‌

ఈ స్థితిలో సాధారణంగా పారదర్శకంగా ఉండే లెన్సులు, గరుకుగా మారతాయి. ఇది నెమ్మదిగా ఎలాంటి నొప్పిలేకుండా చూపు తగ్గేట్లు చేస్తుంది. ప్రాథమికంగా జోడు ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు,తరువాత ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కాటరాక్ట్‌ చికిత్సలో గురుకుగా ఉన్న లెన్సులు తొలగించాల్సి ఉంటుంది.ప్లాస్టికÊ ఇంట్రా ఆక్యులర్‌(కంటిలోపల) లెన్సులను అమర్చడం లేదా కళ్లజోడును ఏర్పాటు చేయడం ద్వారా, ఈ సమస్యను అధిగమించవచ్చు.


డయాబెటిక్‌ రెటినోపతి

డయాబెటిక్‌ వల్ల రెటీనాలో మార్పులు చోటు చేసుకుంటాయి. దీని వల్ల కంటి చూపు దెబ్బతినవచ్చు. ఇలాంటి మార్పులు తిరిగి రివర్స్‌ చేయలేం. పరిస్థితులను ముందస్తుగా గుర్తించినట్లయితే లేజర్‌ ట్రీట్‌మెంట్‌ ద్వారా చూపు ఇంకా పోకుండా కాపాడగలుగుతాం.బ్లడ్‌ షుగర్‌ను కచ్చితంగా నియంత్రించడం ద్వారా, మధుమేహం సోకిన ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా సవిస్తరంగా ప్రతిసంవత్సరం, అర్హత కలిగిన ఆప్థమాలజిస్టు ద్వారా కంటి పరీక్షలు జరిపించుకోవాలి.


గ్లూకోమా

గ్లూకోమా అనేది కంటి చూపును తిరిగి తెప్పించలేని మరో వ్యాధి. ఇందులో కంటిలో పీడనం పెరుగుతుంది. ముందస్తుగా గుర్తించడం మరియు సకాలంలో మందులు తీసుకోవడం అనేది ఎంతో ముఖ్యం.గ్లూకోమా కుటుంబచరిత్ర ఉన్నవారంతా కూడా 40సంవత్సరాల వయస్సులో గ్లూకోమా కోసం రెగ్యులర్‌ ఇంటర్వెల్స్‌లో స్క్రీనింగ్‌ పరీక్షలు జరిపించుకోవాలి.


వయస్సు వల్ల కండరాలు క్షీణించడం

మకులా అనేది రెటీనా చూపుకు ప్రధానమైనది,. వయస్సుతోపాటు మకులా క్రమేపీ కంటి చూపును కోల్పోతుంది.కొన్నిసార్లు ఇది వేగంగా మరియు తీవ్రంగా ఉంటుంది.కొన్ని కేసుల్లో లేజర్‌ థెరపీ అవసరం అవుతుంది. మరికొన్నింటిలో కళ్లద్దాలు, లో విజన్‌ ఎయిడ్స్‌,తాజా పళ్లు మరియు కూరగాయాలు తినడం మరియు సూర్యకాంతి నేరుగా కంటి పడకుండా కాపాడుకోవడం మరియు విటమిన్‌ సప్లిమెంట్స్‌ను మరియు మినరల్స్‌ తీసుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

వీటిలో కొన్ని వ్యాధులు చికిత్సలకు స్పందిస్తాయి. చిఇకిత్స అసమర్థంగా ఉన్నా లేక లభ్యం కాకపోయినా, మిగిలిన చూపు పోకుండా మనం కాపాడగలుగుతాం. కొంత దృష్టిని పొందిన తరువాత గుడ్డివారిగా రిజిస్టర్‌ చేసుకున్నప్పటికీ, చాలా తక్కువ మంది మాత్రమే పూర్తిగా చూడలేకపోతారు. పాక్షికంగా దృష్టిపోయిన వారు ఇండోర్స్‌ మరియు అవుట్‌డోర్స్‌లో ఎలా సురక్షితంగా తిరగగలరో తెలుసుకోవాలి, తద్వారా వారు తమకు తాము షాపింగ్‌ చేయడం , వండుకోవడం, ఇంటి కార్యక్రమాలు మరియు ఖాళీ సమయాల్లో చేసే కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గనగలుగుతారు. ఒకవేళ ఒకవ్యక్తి యొక్క కంటిచూపు మందగించినట్లయితే, ఆ వవ్యక్తిలో కాంతిని గరిష్టం చేయడంతోపాటు లో విజన్‌ ఎయిడ్స్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.