OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్



ఆరోగ్యకరంగా భుజించడం



ఆరోగ్యకరమైన ఎముకలు



మంచి నిద్ర



మీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం



వృద్ధాప్యంలో మంచి చూపు



ఇమ్యూనైజేషన్



చక్కటి వినికిడి



ఔషధాల నిర్వహణ



పాదాల సంరక్షణ



పడటం మరియు ప్రమాదాలు



మలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

మలబద్ధకం

విరేచనం యొక్క సాధారణ అవధిలేదా మలం యొక్క పరిమాణం వ్యక్తిని బట్టి మారుతుంటాయి.విరేచనాలయొక్క అవధి లేదా మల విసర్జనక్లిష్టంగా ఉండటం లేదా మూలం పూర్తిగా విసర్జించలేదన మలబద్ధకాన్ని తెలియజేస్తుంది. మలబద్ధకం అనేది వయోవృద్ధుల్లో సర్వసాధారణంగా కనిపించే ఒక సాధారణ రుగ్మత. యువకులతో పోలిస్తే వయోవృద్ధులు మలబద్ధకంతో బాధపడే అవకాశం ఐదురెట్లు ఎక్కువగా ఉంటుంది. విరేచనానికి సంబంధించి వారికి ఉండే ఆందోళనే దీనికి కారణంగా చెప్పవచ్చు. .

మలబద్ధకం అనేది అనేక రకాల కారణాల వల్ల జరుగుతుంది. దిగువ జీర్ణాశయంలో నిర్మాణాత్మక అసాధారణతలు అనేవి తీవ్రంగా దృష్టిసారించాల్సినవి. వయుస్సు పెరుగుతున్న కొలదీ కొలోరెక్టల్‌ మినహాయింపుపై దృష్టి సారించాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు, పెద్ద సంఖ్యలో రోగుల్లో మలబద్ధకం అనేది నిరపాయకరమైన కారణాల వల్ల ఏర్పడుతుంది, సాధారణంగా ప్రకోప పేగు కదలికలు లేదా పెద్ద గట్‌ యొక్క చలన రుగ్మత వల్ల కలుగుతుంది. మందుల యొక్క ఎఫెక్ట్‌, ఆహారంలో తగినంత పీచుపదార్థాలు మరియుద్రవాలు లేకపోవడం మరియు లాక్సాటివ్‌లపై అధికంగా ఆధారపడటం అనేవి ఇతర కారణాలుగా చెప్పవచ్చు.


ఇతర వైద్య పరిస్థితులైన ఎంటాసిడ్‌లు, యాంటీ డిప్రెసెంట్లు, యాంటీ హిస్టామిన్లు, డైరెక్టివ్స్‌, పార్కిన్‌సన్‌ వ్యాధికి ఔషధాలు, ఎక్కువ రక్తపీడనానికి మందులు, ఐరన్‌ ప్రిపరేషన్లు, కండర ఉపశమనాలు మరియు ఒపియేట్లు కొంతమందివ్యక్తుల్లో మలబద్ధకం కలిగిస్తాయి. కూరగాయలు, పళ్లు మరియు పప్పుధాన్యాలు తక్కువగాను, గుడ్లు, మాంసం మిరయు పాలు లేదా పాల ఉత్పత్తులు ఎక్కువగాను ఉండటం అనేది మలబద్ధకం ఏర్పడటానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికి అదనంగా సరిపడినంత ఆహారం తీసుకోకపోవడం లేదా సాఫ్ట్‌ఫుడ్‌లను తీసుకోవడం అనేది కూడా మలబద్ధకానికి కారణం అవుతుంది.


దీర్ఘకాలికంగా బెడ్‌రెస్ట్‌ తీసుకోవడం యాక్సిడెంట్‌ లేదా అస్వస్థత వల్ల లేదా కదలలేకపోవడం మరియు సహజసిద్ధమైన విరేచన ప్రక్రియను నిర్లక్ష్యం చేయడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. ఇటీవల ఏర్పడ్డ మలబద్ధకానికి సంబంధించి మీరు ఇది మరింత తీవ్రంగా మారకుండా ఉండేందుకు డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. నిర్మాణాత్మక అసాధారణతలు లేనట్లుగా పేర్కొనబడినట్లయితే ఈ దిగువ చర్యలు ,


సాధారణంగా ఉపయోగపడతాయి:
  • తాజా పళ్లు మరియు కూరగాయలు ఎక్కువగా తినడం మరియు ఎక్కువ హోల్‌గ్రెయిన్స్‌ మరియు బ్రెడ్‌లు తినాలి. స్వీట్లు మరియు ఎక్కువగా క్రొవ్వులు ఉండే ప్రాసెస్డ్‌ ఫుడ్‌ను పరిహరించాలి.
  • హృదయం, సర్యులేటరీ లేదా కిడ్నీ సమస్యలు లేనట్లయితే ఎక్కువ మొత్తంలో నీరు( 6 నుంచి 8 గ్లాసుల ద్రవాన్ని)తీసుకోండి. ఎక్కువ మొత్తంలో పాలు తాగడం వల్ల కూడా మలబద్ధకం వస్తుంది.
  • శారీరక వ్యాయామాన్ని పెంచండి
  • ప్రతిరోజూ కూడా ఒక నిర్ధిష్ట సమయంలో టాయిలెట్‌లో గడపడం ద్వారా విరేచక క్రియను అలవాటు చేయండి.
  • లాక్సాటైవ్స్‌ను తీసుకోవడం పరిహరించండి మరియు ఎంటాసిడ్‌లను తీసుకోవడం పరిమితం చేయండి.
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.