OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్



ఆరోగ్యకరంగా భుజించడం



ఆరోగ్యకరమైన ఎముకలు



మంచి నిద్ర



మీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం



వృద్ధాప్యంలో మంచి చూపు



ఇమ్యూనైజేషన్



చక్కటి వినికిడి



ఔషధాల నిర్వహణ



పాదాల సంరక్షణ



పడటం మరియు ప్రమాదాలు



మలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

మధుమేహం

  • డయాబెటిస్‌ మిల్లిటస్‌ అనేది వ్యాధి వల్ల మన ఆహార పదార్థాల్లో ఉండే చక్కెర, మనశరీరంలో సాధారణ కార్యక్రమాలకు అవసరమైన శక్తిరూపంలోకి మార్చబడదు.
  • మనం చక్కెరలు, పప్పుధాన్యాలు తీసుకున్నప్పుడు,మన శరీరం వాటినిగ్లూకోజ్‌గా మారుస్తుంది. ఈ గ్లూకోజ్‌ తక్షణ వినియోగం కోసం రక్తంలో కలపబడుతుంది లేదా భవిష్యత్తు వినియోగం కోసం కాలేయంలో గ్లూకోజన్‌ రూపంలో నిల్వ చేయబడుతుంది. డయాబెటిస్‌లో, రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించే యాంత్రాంగం బలహీనంగా ఉంటుంది. దాని ఫలితంగా రక్తంలో గ్లూకోజ్‌ యొక్క స్థాయి ప్రమాదకరంగా ఉంటుంది, దీని ఫలితంగా ప్రమాదకరమైన రోగలక్షణాలు కనిపిస్తాయి అదేవిధంగా కీలకమైన అవయవాలు దెబ్బతింటాయి.
  • శరీరంలో సరిపడినంత ఇన్సులిన్‌ లేకపోవడం( రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించడం కోసం క్లోమం నుంచి విడుదలయ్యే హార్మోన్‌) లేదా ఇన్సులిన్‌ పూర్తిగా శరీర కణజాలాలపై ప్రభావం చూపించకపోవడం వల్ల ఇది జరుగుతుంది.
  • డయాబెటిస్‌ వల్ల కుటుంబాలు నాశనం అవుతాయి. వంశపారంపర్యంగా రావడంతో పాటు దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఎక్కువ బరువు పెరగడం వల్ల కూడా వయోవృద్ధుల్లో డయాబెటిస్‌ వచ్చే అవకాశం ఉన్నది.
  • డయాబెటిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. టైప్‌ఐ, లేదా ఇన్సులిన్‌ ఆధారిత డయాబెటిస్‌, ఇది తీవ్రమైన డయాబెటిస్‌, ఇది బాల్యం లేదా కౌమార దశలో రావొచ్చు. ఎక్సర్‌సైజులు మరియు నియంత్రిత డైట్‌తో పాటు జీవితకాలం పాటు ఇన్సులిన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.
  • అయితే, వయోవృద్ధుల్లో సాధారణంగా వచ్చే డయాబెటిస్‌ టైప్‌2 లేదా నాన్‌ ఇన్సులిన్‌ ఆధారిత డయాబెటిస్‌.
  • ఇటీవల జరిపిన పరిశోధనల్లో రక్త గ్లూకోజ్‌ లెవల్స్‌ , వయస్సు పెరగడంతోపాటు పెరుగుతాయని తేలింది.
  • టైప్‌2 డయాబెటిస్‌తో బాధపడే చాలా మంది వ్యక్తులకు ఇన్సులిన్‌ ఇంజెక్షన్లు అవసరం లేదు. వారి యొక్క బరువును నియంత్రించుకోవడం,ఎక్సర్‌సైజులు మరియు దిగువ పేర్కొన్న సున్నితమైన డైట్‌ లేదా యాంటీ డయాబెటిక్‌ మాత్రలు తీసుకోవడం ద్వారా వారు డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు.
  • డయాబెటిస్‌ వ్యాధితో బాధపడే వ్యక్తులకు దప్పికపెరగడం, తరచుగా మూత్రానికి వెళ్లడం, ఆకస్మికంగా బరువును కోల్పోవడం,అలసట, చూపు మసకబారడం, చర్మ సంక్రామ్యతలు లేదా దురదపుట్టడం మరియు గాయాలు మరియు పుండ్లు నెమ్మదిగా మానడం వంటివి ఉంటాయి. ఈ సమస్యలను వెంటనే డాక్టర్‌కు రిపోర్టు చేయాలి, డాక్టరు మీ మూత్రం లేదా రక్తంలో అదనంగా గ్లూకోజ్‌ ఉన్నదా అన్న విషయాన్ని గమనిస్తాడు కొన్నిసార్లు ఎలాంటి రోగలక్షణాలుండవు అయితే రోటీన్‌గా జరిపే టెస్టుల్లో ఇది బయట పడవచ్చు. ఉదాహరణకు శస్త్రచికిత్స జరిపే సమయంలో జరిపే చికిత్స ద్వారా
  • స్ట్రోక్‌,అంధత్వం, గుండె జబ్బు, కిడ్నీలు విఫలం కావడం,గాంగ్రైన్‌ మరియు నరాలు దెబ్బతినడం వంటి దీర్ఘకాలిక సంక్లిష్టతలు కూడా డయాబెటిస్‌ వల్ల ఏర్పడతాయి. రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించడం ద్వారా ఈ సమస్యను పరిహరించడం లేదా తగ్గించవచ్చని చాలా మంది నిపుణులు విశ్వసిస్తారు.
  • రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు పెరగడం లేదా తగ్గడం వల్ల తీవ్రమైన వైద్య అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది. రక్తంలో గ్లూకోజ్‌ యొక్క స్థాయి ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్‌ వల్ల రోగి కోమాలో జారుకునే ప్రమాదం ఉన్నది. డయాబెటిస్‌తోబాధపడే వ్యక్తులు ఈ రెండిరటికి సంబంధించిన వార్నింగ్‌ సిగ్నల్స్‌ గురించి మరియు ఈ రెండు ఏర్పడినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయం గురించి తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి.
  • డయాబెటిస్‌ను రూపుమాపలేం, అయితేదాన్ని నియంత్రించవచ్చు. డైట్‌, ఎక్సర్‌సైజులు మరియు అవసరమైతే ఇన్సులిన్‌ లేదా నోటి ద్వారా తీసుకునే మాత్రల ద్వారా దీన్ని ఎంతో సమర్థంగా నియంత్రించవచ్చు.
  • డైట్‌ ప్లానింగ్‌ అనేది బ్లడ్‌ గ్లూకోజ్‌ లెవల్స్‌ను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. డైట్‌ను ప్లానింగ్‌ చేసేటప్పుడు, డాక్టర్‌ రోగి యొక్క బరువును మరియు అతడు ఆమె రోజువారీగా ఎంత మేరకు భౌతిక కార్యకలాపాలు చేస్తున్నారనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటాడు.బరువు ఎక్కువగా ఉన్న రోగుల్లో రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించడం కోసం బరువును తగ్గించే కార్యక్రమాలు అవసరం అవుతాయి.
  • ఎక్సర్‌సైజులు అనేవి ఎంతో ముఖ్యమైనవి ఇవి శరీరంలో అదనంగా ఉన్న గ్లూకోజ్‌ను శక్తిగా మార్చడంలోసాయపడతాయి. రోగి అతని/ఆమె యొక్క సాధారణ ఆరోగ్యానికి దోహదపడే విధంగా సంతులిక ఆహారం మరియు అవసరమై మందులతోపాటు వ్యాయామ కార్యక్రమాలను డాక్టర్‌ ప్లాన్‌ చేస్తాడు.
  • డైట్‌ మరియు ఎక్సర్‌సైజుల ద్వారా రక్తంలోని చక్కెరలను నియంత్రించడం సాధ్యం కానప్పుడు మందులు(ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌లు లేదా నోటి ద్వారా తీసుకునే టాబ్లెట్‌లు) ఇవ్వాల్సి ఉంటుంది.కొన్నిసార్లురోగి ఔషదాలు లేకుండా బాగానే ఉంటాడు అయితే అస్వస్థత లేదా సంక్రామ్యత సమయంలో స్వల్పకాలిక ప్రాతిపదికన ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది.
  • డయాబెటిస్‌ ఉన్న వ్యక్తులు తమ పాదాల గురించి అమితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఈ వ్యాధి వల్ల పాదాలను రక్తం చేరుకోవడం తగ్గించబడుతుంది. డయాబెటిస్‌ ఉన్నఉ వారు ప్రతిరోజూ తమ పాదాలను గమనించుకోవాలి, ఎమైనా పుండ్లు, సంక్రామ్యతలు లేదా గీచుకోవడం జరిగినట్లయితే నిర్లక్ష్యం వహించకుండా తక్షణం ఆ విషయాన్ని ఫ్యామిలీ డాక్టర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది.
  • డయాబెటిస్‌ అనేది ఇతర వ్యాధులతో పోలిస్తే తక్కువగా నిరోధించగలిగినది. వారు తమ శరీరాలకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుకోవాలి. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి మరియు చర్మం పొడిగా ఉన్నట్లయితే చర్మం సాఫ్ట్‌నర్స్‌ను ఉపయోగించాలి మరియు చిన్నపాటి గాయాలు మరియు పుండ్ల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. డయాబెటిస్‌ దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల అంధత్వం వస్తుంది,వార్షికంగా కళ్లను చెక్‌ చేయించుకోవడం ద్వారా దీన్ని పరిహరించవచ్చు.
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.