OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ఆరోగ్యకరంగా భుజించడంఆరోగ్యకరమైన ఎముకలుమంచి నిద్రమీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడంవృద్ధాప్యంలో మంచి చూపుఇమ్యూనైజేషన్చక్కటి వినికిడిఔషధాల నిర్వహణపాదాల సంరక్షణపడటం మరియు ప్రమాదాలుమలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

పడటం మరియు ప్రమాదాలు

పడటం లేదా యాక్సిడెంట్లు అనేవి ‘కేవలం జరగవు’ మరియు చాలాసార్లు అటువంటి పరిస్థితి ఏర్పడటంకోసం యాక్సిడెంట్లు కాచుకొని ఉంటాయి. వీటిని పరిహరించాల్సి ఉంటుంది. పడటం వల్ల వృద్ధాప్యంలో తీవ్రమైన పరిస్థితులు ఏర్పడతాయి. దీని వల్ల గాయం, విరిగడం మరియు యాకివ్‌గా, స్వతంత్రంగా జీవించడ అనేది పరిమితం అవుతుంది. వేలాది మంది పురుషులు మరియు స్త్రీలు, వైకల్యం బారిన పడతారు, తరచుగా ఈ వైకల్యం శాశ్వత వైకల్యం అవుతుంది. పడతామనే భయం కూడా మానసికంగా వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.


పరిసరాల్లో మార్పులు మరియు ఈ దిగువ భద్రతా చర్యల్ని చేపట్టడం ద్వారా పడటం మరియు గాయాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.


వృద్ధాప్యంలో పడటానికి కారణాలు
 • దృష్టి మారడం, వినికిడి సమస్యలు, కండరాల బలం, కోఆర్డినేషన్‌ మరియు రిఫెక్ట్‌ల వల్ల వృద్ధులు పడుతుంటారు. దీనికి అదనంగా గుండె,మెదడు,ఎముకలు మరియు జాయింట్లు యొక్క వ్యాధులు, థైరాయిడ్‌ మరియు డయాబెటిస్‌ వంటివి కూడా బ్యాలెన్స్‌ తప్పేట్లు చేస్తాయి. ఈ వ్యాధులకు అనేక రకాలమందు తీసుకోవడం వల్ల మైకం కమ్మడం లేదా కళ్లు చీకట్లు కమ్మడం లేదా పడటం జరుగుతుంది.
 • చాలా ఎక్కువ సందర్భాల్లో బెడ్‌ రూమ్‌ లేదా బాత్‌రూమ్‌లో సరైన లైటింగ్‌ లేకపోవడం వల్ల, జారే ఫ్లోర్లు, ఫ్లోర్‌పై పుస్తకాలు మరియు కాగితాలు, వాతావరణంలో చిన్నపాటి అడ్డంకుల వల్ల పడటం జరుగుతుంది.

పడటం మరియు యాక్సిడెంట్ల వల్ల సంరక్షణ

పడటం మరియు ప్రమాదాలు జరగకుండా పరిహరించేందుకు అనేక సరళమైన చిట్కాలున్నాయి. వీటి ద్వారా మనం మనం ఇంటికి, పరిసరాలను సురక్షితంగా ఉంచుకోవచ్చు.


 • మీరు తీసుకుంటున్న మందుల యొక్క పార్శ్వ ప్రభావాల గురించి మీరు మీ డాక్టర్‌తో మాట్లాడండి. అవి మీ కో ఆర్డినేషన్‌ లేదా బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తున్నాయా లేదా అని చెక్‌ చేయండి. పడకుండా ఉండే సంభావ్యతను తగ్గించేందుకు ఉండే మార్గాలను సిఫారసు చేయమని వారిని అడగండి.
 • ఆల్కహాల్‌ వల్ల బ్యాలెన్స్‌ మరియు రిఫ్లెక్స్‌లపై ప్రభావం పడుతుంది.కనుక డ్రైవింగ్‌ చేయడానికి ముందు ఆల్కహాల్‌ తీసుకోవడం అనేది పరిమితం చేయాలి.
 • భోజనం చేసిన తరువాత వేగంగా లేవడం, నిద్రలేచిన తరవుఆత, కింద పడటం లేదా దీర్ఘకాలంపాటు విశ్రాంతి తీసుకున్న తరువాత లేచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ సమయాల్లో రక్తపీడనం గణనీయంగా తగ్గవచ్చు మరియు దీని వల్ల మైకం కమ్మి, పడిపోయే అవకాశం ఉంటుంది.
 • అసమతలంగా ఉన్న గ్రౌండ్‌పై నడిచేటప్పుడు లేదా నడిచేటప్పుడు మగతగా ఉన్నట్లు అనిపిస్తే క్యాన్‌, వాకింగ్‌ స్టిక్‌ లేదా వాకర్‌ను ఉపయోగించండి. తడి పేవ్‌మెంట్లపై నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
 • సపోర్టివ్‌, రబ్బరు సోల్‌ కలిగిన, తక్కువ హీల్‌ ఉనÊ షూలను ధరించండి. స్మూత్‌ సోల్‌ ఉన్న షూలు లేదా స్లిప్పర్లను మెట్లపైనా లేదా జారే ఫ్లోర్లపైనా ధరించవద్దు.
 • క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయండి. రెగ్యులర్‌ ఫిజికల్‌ యాక్టివిటీ, బలాన్ని మరియు కండరాల టోన్‌ను వృద్ధి చెందిస్తుంది,దీని వల్ల జాయింట్లు,టెండన్‌లు మరియు లిగ్మెట్లను మరింత సరళంగా కదపడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆస్ట్రోపోరోసిస్‌ వల్ల స్వల్పంగా బరువులను ఎత్తినా ఎముకల్లో నష్టం వాటిల్లుతుంది.

ఈ దిగువ కార్యక్రమాల ద్వారా ఇల్లు సురక్షితమైనదనే భావన కలిగించాలి.
 • మెట్లు, కారిడర్లు మరియు బాత్‌రూమ్‌ల్లో మంచి వెలుతురు వచ్చేట్లుగా చూడటం
 • లైట్‌ స్విచ్‌లు,టెలిఫోన్లు మరియు నిత్యజీవితంలో ఉపయోగించే వస్తువులను తేలికగా చేరుకోవడం
 • మెట్లు మరియు బాత్‌రూమ్‌ల్లో హ్యాండ్‌ రైల్స్‌ మరియు గ్రాబ్‌ బార్లు
 • బాత్‌రూమ్‌లో సరిగ్గా డిజైన్‌ చేయబడ్డ ఫ్లోరింగ్‌వల్ల నీరు చేరడం అదేవిధంగా ఫ్లోర్‌ జారకుండానూ ఉంటుంది.
 • ఎలక్ట్రిక్‌ కార్డులు మరియు టెలిఫోన్‌ వైర్లను నడిచే మార్గాల్లో ఉంచరాదు
 • బెడ్లు మరియు కుర్చీలు సరైన ఎత్తులో ఉండాలి, తద్వారా ఎక్కడం మరియు దిగడం సులభతరంగా ఉంటుంది
 • మరియు వెలుపలి మెట్లు మరియు నడకమార్గాలకు చక్కగా రిపేర్‌ చేయించాలి.
 • కాలడం అనేది పెద్దవారిలో సర్వసాధారణం మరియుఇవి తగ్గడం అనేది చాలా కష్టం. కొన్ని చిన్నపాటి చర్యల ద్వారా కాలిన గాయాల యొక్క రిస్క్‌లను తగ్గించవచ్చు.
 • మోటార్‌ వేహికల్స్‌ యాక్సిడెంట్లు, అనేవి వయోవృద్ధుల్లో యాక్సిడెంట్ల మరణాలకు కారణం అవుతాయి.మోటార్‌ వేహికల్స్‌ నడిపే వ్యక్తులు
 • వయస్సు సంబంధ మార్పులు అయిన గ్లేర్‌కు సున్నితత్త్వం పెరగడం, చీకటిని సరిగ్గా చూడకోవడం , సమన్వయం లోపించడం మరియు తక్కువ స్పందన రేటు వంటి వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. తక్కువ వేగంలో వాహనాన్ని డ్రైవ్‌ చేయడం ద్వారాను తక్కువగా డ్రైవింగ్‌ చేయడం ద్వారాను, రాత్రిపూట మరియు బాగా రష్‌గా ఉండే సమయాల్లో డ్రైవింగ్‌ చేయకుండా ఉండటం ద్వారా దీన్ని పరిహరించవచ్చు

పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టును వినియోగించడం
 • బస్‌ నెమ్మదించినప్పుడు మరియు టర్నింగ్‌ తిరుగుతున్నప్పుడు మీ అంతట మీరు అలర్ట్‌గా ఉండటం .
 • వాహనంలోకి ప్రవేశించేటప్పుడు మరియు దిగేటప్పుడు జారే పేమెంట్‌మెంట్లు మరియు ఇతర ప్రమాదాలను గమనించండి.
 • కుదుపుల్లో పడినప్పుడు బ్యాలెన్స్‌ కోల్పోకుండా సంరక్షించుకోవడం కోసం జాగ్రత్తగా ఉండటం.
 • ఎక్కువ ప్యాకేజీలను పట్టుకెళ్లవద్దు మరియు ఏదైనా గ్రిప్పును పట్టుకునేందుకు, ఒక చేతిని ఖాళీగా ఉంచండి.
 • రోడ్లను నెమ్మదిగా దాటండి మరియు జాగ్రత్తగా దాటండి, ధృవీకరించబడ్డ ప్రాంతంలో మాత్రమే దాటడానికి యత్నించండి.
 • వాతావరణం బాగాలేనప్పుడు రోడ్లను దాటడానికి అదనపు సమయాన్ని తీసుకోండి.
 • రాత్రి సమయాల్లో లైట్‌ కలర్‌ దుస్తులను ధరించడం మరియు ఫ్లాష్‌ లైటును తీసుకెళ్లడం చేయండి.
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.