OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్



ఆరోగ్యకరంగా భుజించడం



ఆరోగ్యకరమైన ఎముకలు



మంచి నిద్ర



మీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం



వృద్ధాప్యంలో మంచి చూపు



ఇమ్యూనైజేషన్



చక్కటి వినికిడి



ఔషధాల నిర్వహణ



పాదాల సంరక్షణ



పడటం మరియు ప్రమాదాలు



మలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

చక్కటి వినికిడి

మీరు వృద్ధులుగా ఎదుగుతున్నకొలదీ కూడా మీ యొక్క వినికిడి శక్తి నెమ్మదిగా తగ్గుతుంది. మీకు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు దీన్ని గుర్తించలేరు. 60సంవత్సరాలకు పైబడిని 60శాతం మంది వ్యక్తులకు వయస్సు వల్ల వినికిడి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మీ యొక్క వినికిడిని చెక్‌ చేసుకోవడంకోసం ఇక్కడచెక్‌లిస్టు ఇవ్వబడిరది. .


  • మీరు టీవీ లేదా రేడియో యొక్క సౌండ్‌ ఎక్కువగా పెడతారని మీ కుటుంబసభ్యులు ఫిర్యాదు చేస్తున్నారా??
  • మీతో మాట్లాడే వ్యక్తులు మరింత స్పష్టంగా మరియు గొణగకుండా మాట్లాడాలని మీరు అనుకుంటున్నారా?
  • మీరు పేరు పిలిచినప్పుడు మీరు ఎప్పుడైనా మిస్‌ అయ్యారా?
  • మీకు ఏదుటి వ్యక్తులు చెప్పేదాన్ని మీరు తప్పగా అర్థం చేసుకున్నారా? ?
  • మీతో మాట్లాడే వ్యక్తులను రిపీట్‌ చేయమని మీరు మీ అంతట మీరు కోరారా??
  • సోషల్‌ గ్యాదరింగ్‌, దేవాలయాలు లేదా బ్యాక్‌గ్రౌండ్‌ ధ్వని ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వినడం అనేది కష్టంగా ఉన్నదా?
  • డోర్‌బోర్‌ లేదా టెలిఫోన్‌ను వినడం మీకు కష్టంగా అనిపించిందా??
  • మీరు రేడియో లేదా టెలివిజన్‌ను మీరు సాధారణంగా మీరు ఉపయోగించే సౌండ్‌ కంటే ఎక్కువ సౌండ్‌ను వినియోగిస్తున్నారా??

ఒకవేళ పైన పేర్కొన్న ప్రశ్నల్లో ఏదైనా ఒకప్రశ్నకు అవును అనే సమాధానం వచ్చినట్లయితే అపుడు మీరు తక్షణం డాక్టరును సంప్రదించాలి మరియు మీరు మీ వినికిడి శక్తికి సంబంధించి మీకు ఉన్న సందేహాలను వివరించాల్సి ఉంటుంది. మీరు వినికిడి కోల్పోవడానికి సంబంధించి అనేక రకాల సమస్యలుండవచ్చు, కను మీ డాక్టరు మిమ్ముల్ని పరీక్షించాలి మరియు మిమ్ముల్ని కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. తద్వారా సమస్య ఏమిటని తెలుసుకోగలుగుతాడు. ఉదాహరణకు మీ చెవిలో పెద్దమొత్తంలో గుబిలి ఉన్నట్లయితే దాన్నితక్షణం తొలగించాలి అదేవిధంగా మీ చెవిలో ఏదైనా అంటువ్యాధి ఉన్నట్లయితే దానికి చికిత్స చేయాలి.అయితే ఒకవేళ మీ వినికిడి నష్టానికి సంబంధించి ఎలాంటి నిర్ధిష్ట కారణాన్ని డాక్టరు కనుగొనట్లయితే,మిమ్ముల్ని చెవి, ముక్కు మరియు గొంతు నిపుణుడు(ఈఎన్‌టి) .


హియరింగ్‌ ఎయిడ్‌

ధ్వనిని యాంప్లిఫై చేసి మరింత పెద్దగా వినపడేట్లుగా చేసేదే హియరింగ్‌ ఎయిడ్‌. మీరు ఏ మేరకు వినికిడి శక్తిని కోల్పోయారన్నదానిపై ఆధారపడి ఆవర్థనం చేయడం అనేది ఉంటుంది. హియరింగ్‌ ఎయిడ్‌ అన్ని రకాల శబ్ధాలను ఆవర్థనం చేస్తుంది. అయితే మాట్లాడేటప్పుడు ఏ ధ్వని అయితే వస్తుందో ఆ ధ్వని వచ్చే విధంగా ఇవి డిజైన్‌ చేయబడతాయి. ధ్వనులు వివిధ రకాల పిచ్‌లు మరియు పౌనంపున్యాల్లో చేయబడతాయి. హియరింగ్‌ ఎయిడ్‌ ఈ విభిన్న పిచ్‌లను విభిన్న మొత్తాలను ఆవర్థనం చేస్తుంది , ఎందుకంటే మీకు వినికిడి శక్తి కోల్పయినప్పుడు, ఇతరుల కంటే మెరుగ్గా ఒక పౌన:పున్యాన్ని మీరు వినగలగుతారు. వయోవృద్ధుల్లో సాధారణంగా ఎక్కువ పౌన:పున్యం వినడం అనేది కష్టంగా ఉంటుంది. మీరు మాట్లాడటం యొక్కధ్వనిని వినవచ్చు అయితే మీరు వాస్తవ పదాలను వినలేకపోవచ్చు. .


అన్ని రకాల అవసరాలను తీర్చడం కోసం మార్కెట్లో విభిన్న రకాలైన హియర్‌ఎయిడ్‌లున్నాయి. హియరింగ్‌ ఎయిడ్‌లు వాణిజ్యపరంగా లభిస్తాయి. వాటి నుంచి ఎంచుకోవడానికి అనేక రకాల హియరింగ్‌ ఎయిడ్‌లున్నాయి, అయితే అన్ని కూడా మీకు సూట్‌ అయ్యేవిధంగా ఉండకపోవచ్చు. కొంత మంది వ్యక్తులకు చెవిలో హియరింగ్‌ఎయిడ్‌ ఉంటుంది. ఇవి చెవిలో పూర్తిగా ఫిట్‌అయి ఉంటుంది. మీకు తీవ్రమైన వినికిడి లోపం ఉన్నట్లయితే ఇటువంటి హియరింగ్‌ ఎయిడ్‌ సూటబుల్‌ కాదు. ‘ శరీరంపై ధరించే ఎయిడ్‌’ అనేది చిన్న యూనిట్‌ రూపంలో ఉంటుంది మరియు దీన్ని శరీరంపై ధరించాల్సి ఉంటుంది. ఒక లీడ్‌ ఈయర్‌ఫోన్‌కు మరియు ఈయర్‌ మౌల్డ్‌కు కనెక్ట్‌ చేయబడుతుంది. ఇది ఇతరత రకాలైన హియరింగ్‌ ఎయిడ్స్‌తో పోలిస్తే ఎంతో గజిబిజిగా ఉంటుంది.కానీ దీని యొక్క సైజు మరియుతేలికగా ఉపయోగించడం మరియు ఎక్కువ ఆవర్థనం కలిగించడం వల్ల వీటిని ఎక్కువగా వినియోగిస్తారు. .


హియరింగ్‌ ఎయిడ్‌ వల్ల మీ యొక్క వినికిడి సాధారణ స్థితికి రాదు లేదా మీ చెవుడు నయం కాదు. ఇది కేవలం వినడానికి సాయపడే ఉపకరణం మాత్రమే. మీరు మొట్టమొదటి సారిగా హియరింగ్‌ ఎయిడ్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, ప్రతిరోజూ కూడా శబ్ధాలు పెద్దవిగా వినపడటం జరుగుతుంది. ధ్వనులను సాధారణ స్థాయిలో వినడానికి కొన్ని నెలలు పడుతుంది. తొలిదశలో మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీరు తదుపరి సలహా కోసం ఏవ్యక్తి వద్ద అయితే కొనుగోలు చేశారో ఆ వ్యక్తి వద్దకు వెళ్లండి. .


కొన్నిపరిస్థితుల కంటే మరికొన్ని పరిస్థితుల్లో హియరింగ్‌ ఎయిడ్‌ ఎంతో ఉపయుక్తమైనదని మీరు భావిస్తారు. మీరు ప్రయోగం చేయాల్సి ఉంటుంది. నిశ్శబ్ధంగా ఉన్నప్పుడు మరియు మీరు ఒకరిద్దరు మాట్లాడుతున్నప్పుడు హియరింగ్‌ ఎయిడ్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది., బ్యాక్‌గ్రౌండ్‌ ధ్వని, మ్యూజిక్‌, ఇతర వ్యక్తులు మాట్లాడటం, మీరు వినడానికి ప్రయత్నించే దానికి అంతరాయం కలిగించవచ్చు. దీనికంటే బిజిగా లేదా రణగొణ ధ్వనులతో నిండిన ప్రాంతంలో ఉపయోగించడం అనేది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. .

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.