OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్



ఆరోగ్యకరంగా భుజించడం



ఆరోగ్యకరమైన ఎముకలు



మంచి నిద్ర



మీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం



వృద్ధాప్యంలో మంచి చూపు



ఇమ్యూనైజేషన్



చక్కటి వినికిడి



ఔషధాల నిర్వహణ



పాదాల సంరక్షణ



పడటం మరియు ప్రమాదాలు



మలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

ఆరోగ్యకరమైన ఎముకలు

ఎముకలు అనేవి జీవించిన ఉన్న కణజాలాలు మరియు ఇవి కొత్త ఎముకలు ఏర్పడటంతో నిరంతరం మారుతుంటాయి. పాత ఎముకలు పాడైతే వాటి స్థానంలో కొత్త ఎముకలు ఉద్భవిస్తాయి. ఇలా జీవితకాలం మొత్తం జరుగుతుంది. నడవడం కోసం మరియు స్వతంత్రంగా ఉండటం కొరకు మరియు స్వతంత్రంగా ఉండటం కొరకు మనం మన ఎముకల్ని ఆరోగ్యవంతంగాను మరియు వ్యాధులను నుంచి సంరక్షించుకోవాలి. మనకు 35 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఎముకలు బలంగా ఎదుగుతాయి. వయస్సు పెరుగుతున్న కొలదీ, కొత్త ఎముకలు ఏర్పడే రేటుతో పోలిస్తే, పాత ఎముకలు వేగంగా నాశనం అవుతుంటాయి. మరిముఖ్యంగా ఆడవారిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటికి ప్రత్యామ్నాయం కల్పించడ కోసం ఎముకలు ఏర్పడతాయి. ఈ ఎముకలు చాలా బలహీనంగా, పెళుసగా మరియు తేలికగా విరిగిపోయే విధంగా ఉంటాయి. ఈ కండిషన్‌ను ఆర్టిరోపోరోసిస్‌ అని అంటారు.మనం స్కెలిటిన్‌ను ఈ వ్యాధి నుంచి ఎలా కాపాడుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం.


విరగడాన్ని పరిహరించడం

60 సంవత్సరాలు పై బడిన ప్రతి నలుగురు మహిళ్లో ఒకరు ప్రతి ఎనిమిది మంది మగవారిలో ఒకరు ఆస్ట్రోపోరోసిస్‌ వల్ల విరగడం వల్ల బాధపడుతున్నారు. పిరుదులు, వెన్ను మరియు మణికట్టు వద్ద ఎముకలు విరగడానికి ఎక్కువ సంభావ్యత ఉంటుంది. మోనోపాజ్‌ మరియు మోనోపాజ్‌ తరువాత మహిళల్లో ఇది ఎక్కువగా ఉంటుంది మరియు వీరిలో ఆస్ట్రోజిన్‌ లోపించడం వల్ల వేగంగా ఎముకలునష్టపోవడం జరుగుతుంది. హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ ద్వారా ఈ దశలో ఎముక నష్టాన్ని పరిహరించవచ్చు.నొప్పి, విరగడంతోపాటు, స్వతంత్రంగా జీవించడం కష్టం అవుతుంది. చలనానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. భారతదేశంలో ఎంతమందికి ఆస్టిరోపోరోసిసన్‌ ఉన్నదనే విషయం మనకు తెలియదు, సాధారణ పూర్‌ నూట్రిషనల్‌ స్టేటస్‌ మరియు తప్పుడు జీవన విధానాల వల్ల ఇది సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఏవయస్సులో ఉన్నప్పటికిచిన్నపాటి చర్యలు తీసుకోవడం ద్వారా ప్రతిఒక్కరూ కూడా విరగడాన్ని పరిహరించుకోవచ్చు.

మీరు వృద్ధులవుతున్న కొలదీ కూడా, మీరు పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఇంటిని సురక్షితంగా మార్చుకోవాలి. ఈ దిగువ పేర్కొన్న కొన్ని ప్రాక్టికల్‌ స్టెప్స్‌ను మీరు పాటించాల్సి ఉంటుంది.


  • మీరు జారడానికి లేదా దొర్లడానికి సంభావ్యత ఉన్న వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి .
  • ఎత్తు ఎక్కడం లేదా వంగకుండా ఉండటాన్ని పరిహరించేందుకు ప్రతిరోజూఉపయోగించే వస్తువులను సరైన ఎత్తులోఉంచండి.
  • మెట్లు మరియు కిటికీల్లో లైట్లు ధారళంగా వెలిగించండిరెగ్యులర్‌గా జరిపే విజన్‌ టెస్టుల వల్ల మీకు మీ చూపు సరిగ్గా ఉన్నదా లేదా అన్న విషయం తెలుస్తుంది.
  • కాల్షియం మరియు విటమిన్‌ డిని ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి.

ఎముక ఆరోగ్యం మెయింటెన్‌ చేయడం కోసం కాల్షియం మరియు విటమిన్‌ డి ఎంతగానో అవసరం అవుతాయి. మరిముఖ్యంగా వయస్సు పెరగడంతోపాటు ఎముక ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. విటమిన్‌ డి మరియు కాల్షియం వీటిలో ఎక్కువగా ఉంటుంది. పాలు మరియు పాల ఉత్పత్తులు, బీన్స్‌, స్పినాచ్‌,నట్స్‌ మరియు డ్రైడ్‌ ఫూట్స్‌లో ఎక్కువగా ఉంటుంది. నిరవధికంగా విటమిన్‌ డి మరియు కాల్షియం అందించడం కోసం వయోవృద్ధులు మార్కెట్లో లభించే కాల్షియం ట్యాబెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. పురుషులు 500మిగ్రా మరియు స్త్రీలు 1000 మిగ్రా తీసుకోవాల్సి ఉంటుంది.


ఆరోగ్యకరమైన జీవన విధానం
  • వ్యాయామం చేయడం వల్ల ఎముకల చుట్టూ ఉండే కండరాలను బలోపేతం చేస్తుంది. రోజువారీగా వేగంగా నడవడం వల్ల ఎముకలు ఆరోగ్యవంతంగా ఉండటానికి సాయపడతాయి. ఇది బ్యాలెన్స్‌ మరియు కో ఆర్డినేషన్‌ను పెంచుతుంది. తద్వారా పడకుండా ఉంటాం.
  • మద్యం మరియు పొగాకు అనేవి ఎముకలకు హానికరమైనది మరియు వీటిని పరిహరించాలి.
  • కాపీ, టీ మరియు కోలా డ్రిరకులను ఎక్కువగా తీసుకోవడం వల్ల పళ్లు దెబ్బతింటాయి కనుక వాటిని పరిహరించాలి.

ఒకవేళ మీకు ఏదైనా విరిగినా లేదా వెన్నునెప్పి వచ్చినా, ఎత్తు కోల్పోవడం జరిగినట్లయితే, మీకు పెళుసైన ఎముకలు ఉన్నట్లు లెక్క. ఆస్ట్రో పోరోసిస్‌కు చికిత్స చేయవచ్చు. మీ యొక్క పరిస్థితిని మూల్యాంకనం చేయడం కోసం మీకు దగ్గరలో ఉన్న వైద్యునితో మాట్లాడండి మరియు నేడు లభ్యమవుతున్న చికిత్సకు సంబంధించి సలహా పొందండి.


  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.