OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ఆరోగ్యకరంగా భుజించడంఆరోగ్యకరమైన ఎముకలుమంచి నిద్రమీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడంవృద్ధాప్యంలో మంచి చూపుఇమ్యూనైజేషన్చక్కటి వినికిడిఔషధాల నిర్వహణపాదాల సంరక్షణపడటం మరియు ప్రమాదాలుమలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

ఔషధాల నిర్వహణ

మందులు అనేవి జీవితంలో ఒక భాగం, యువతగా ఉన్నప్పుడు ఇవి అరుదుగా అవసరం పడతాయి.అయితే వయస్సు పెరుగుతున్న కొలదీ వీటి అవసరం పెరుగుతుంది. వయోవృద్ధులు మందుల విషయంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. మందులను తొలగించేటప్పుడు కాలేయం మరియు కిడ్నీలు మందుల ప్రభావానికి చాలా తక్కువగా గురయ్యేట్లుగా చూడాలి, తద్వారా శరీరంలో ఎక్కువ కాలం చురుకుదనం ఉంటుంది.డాక్టర్లు సిఫారసు చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలో మందులు తీసుకోరాదు.మందుల నిర్వహణకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు ఈ ఛాప్టర్‌లో ఇవ్వబడ్డాయి.


మందుల పేర్లు

చాలా మందులకు రెండు పేర్లుఉంటాయి. బ్రాండ్‌ పేరు లేదా ట్రేడ్‌ పేరు. ఇది తయారీదారుడు పెట్టే పేరు. ఇక అప్రూవ్డ్‌ పేరు లేదా ఫార్మలాజిల్‌ పేరుఅనేది దానిలో ఉండే పదార్థాలను తెలియజేస్తుంది. ఎటువంటి బ్రాండ్‌ పదార్థం ఉపయోగించినా ఎలాంటి ఇబ్బంది ఉండదు, అయితే బ్రాండ్‌ను మార్చకుండా ఉండటం అనేది మంచిది. మీరు కొత్త మెడిసిన్‌ను కొనుగోలు చేసినప్పుడు, దాని అప్రూవ్డ్‌ పేరును గమనించండి, తద్వారా మీరు ఇప్పటికే తీసుకుంటున్న పదార్థాలు దానిలో ఉననట్లయితే దాన్ని మీరు పరిహరించవచ్చు. వోవర్‌ ద కైంటర్‌ ద్వారా మందుల్ని కొనుగోలు చేసేటప్పుడు అవి మీకు సూట్‌ అవుతాయా లేదా అని తెలుసుకోవడం ఎంతో ముఖ్యం


పార్శ్వప్రభావాలను తగ్గించడం

ఏ మందులు కూడా పార్శ్వ ప్రభావాలు లేకండా ఉండవు. అన్ని పార్శ్వప్రభావాలు తప్పనిసరిగా జరగాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం ఔషధాల యొక్క పార్శ్వప్రభావాలను తగ్గించవచ్చు.


  • మీరు ఏవైనా రోగలక్షణాలను అనుభవిస్తూ, అవి మందుల వల్ల వచ్చాయని మీరు భావించినట్లయితే, మీరు మీ డాక్టర్‌ను తక్షణం సంప్రదించాల్సి ఉంటుంది.
  • ఆహారంతో పాటు లేదా డాక్టరు సూచించిన విధంగా ఔషధాలను తీసుకోవడం వల్ల కడుపులో గందరగోళాన్ని తగ్గించవచ్చు. యాంటిబయోటిక్‌ సాధ్యమైనంత సమర్థంగా పనిచేయడం కోసం, స్వల్పంగా వికారం లేదా లూజ్‌మోషన్స్‌ వంటి అసౌకర్యాల్ని కాస్తంతపట్టించుకోకుండా ఉండటం వల్ల సర్దుబాటు అవుతుంది.
  • డోస్‌ను మరియు తీసుకునే పద్ధతిలో మార్పులు తీసుకురావడం ద్వారా కొన్ని రకాల సైడ్‌ ఎఫెక్ట్‌లను తగ్గించవచ్చు.

సురక్షితంగా ఉంచడం

మీ మందులను ఎన్నటికీ ఇతరులతో పంచుకోవద్దు. మీ ఇంటిలో పిల్లలు లేనప్పటికీ మందులు ఎన్నిటికీ పిల్లలకు అందుబాటులో ఉంచవద్దు. మందులు ఎక్కువ కాలం రావడం కోసం సాధారణంగా చల్లగా మరియు పొడిగా ఉండే ప్రాంతాల్లో ఉపయోగించాలి.


గడువు ముగియడానికి ముందు వినియోగించండి

ఆహారాలువలేనే అన్ని ఔషధాలకు ఒక నిర్ధిష్ట జీవితకాలం ఉంటుంది, కనుక చిన్న పరిమణాల్లో ఔషధాలను పొందడం ఉత్తమం ఎందుకంటే గడువు ముగిసిన తరువాత వాటిని ఉపయోగించలేం. క్రీమ్‌లు మరియు ఆయింట్‌మెంట్ల యొక్క ట్యూబ్‌లపై సాధారణంగా ఒక తేదీ ఉంటుంది. మందుల కంటైనర్‌పై తేదీ లేనట్లయితే, టాబ్లెట్లు మరియు క్యాప్సుల్స్‌ను ఒక సంవత్సరం కంటే ఎక్కువ ఉపయోగించవద్దు. ద్రవాలను కేవలం ఆరు నెలలపాటు మాత్రమే ఉపయోగించాలి.


ఇక ఏ మాత్రం ఉపయోగం లేని మందులను నాశనం చేయడం ద్వారా అవుట్‌ ఆఫ్‌ తేదీ మందులను మీరు పరిహరించాల్సిఉంటుంది. వాటిని భవిష్యత్తు కోసం దాచుకోవద్దు.


మందుల్ని గుర్తు పెట్టుకోవడం

మందులను తీసుకోవడాన్ని గుర్తుపెట్టుకోవడం కొన్నిసార్లు కష్టం అవుతుంది.మీకుఉపయుక్తమైన సమయాల్లో మందులను నిర్వహణ చేపట్టండి. అన్నం తీసుకునే సమయంలో మందు తీసుకోవడం అనేది అత్యుత్తమం. ఖాళీ కడుపుతో మాత్ర తీసుకోవాలని మందుపై రాసి ఉన్నట్లయితే మీరు ఆహారం తీసుకోవడానికి ఒకగంట ముందు తప్పనిగా తీసుకోవాలి. ఇది మరిముఖ్యంగా యాంటీబయోటిక్స్‌ విషయంలో వర్తిస్తుంది.


మందులు, క్రీమ్‌లు మరియు ఇన్‌హెలర్లు

కళ్లు, చెవి మరియు ముక్కుల్లో వేసే చుక్కల మందుల విషయంలో కూడా ట్యాబెట్లు మరియు క్యాప్సుల్‌ల విషయంలో ఉండే పార్శ్వ ప్రభావాలుంటాయి.మీ చుక్కల మందును ఎవరితోనూ పంచుకోవద్దు. కళ్ల డ్రాప్‌ల కంటైనర్‌ తెరిచిన తరువాత కేవలం ఒక నెల మంచి ఉపయోగించరాదు. మీ డ్రాప్స్‌ వేసుకునేటప్పుడు అవి మీ కళ్లను తాకుండా చూసుకోండి. క్రీమ్‌లు మరియు ఆయింట్‌మెంట్లనుఎంతో జాగ్రత్తగా ఉపరయోగించాలి. క్రీమ్‌ లేదా ఆయింట్‌మెంట్‌ ఉపయోగించిన ప్రతిసారీ కూడా మీరు మీ చేతులను శుభ్రం చేసుకోవాలి.


ఇన్‌హెలర్లు అనేవి ఆధునిక వ్యవస్థలు. ఇవి మందును ఊపిరితిత్తులకు పంపుతాయి.దీని వల్ల శ్వాసించడం అనేది సులభతరం అవుతుంది.అయితే ఫఫర్‌ను నొక్కడం మరియు సరైన సమయంలో దానిని శ్వాసించడం అనేది తరచుగా అంత తేలికైనది కాదు. చాలామంది వ్యక్తులు తరచుగా సరైన డోస్‌ను పొందలేకపోతారు. ప్రత్యామ్నాయంగా, మీరు ఇన్‌హెలర్‌తోపాటు స్పేసర్‌ను వినియోగించవచ్చు. ఇది ఉపయోగించడం ఎంతో తేలిక. మీ ఇన్‌హెలర్‌తో సమస్య ఉన్నట్లయితే వాటిని ఉపయోగించడానికి సంబంధించి మీ డాక్టర్‌ సలహాను అడగండి.


రిపీట్‌ ప్రిస్కిప్షన్లు

ఒకవేళ మీరు రెగ్యులర్‌గా మెడిసిన్స్‌ తీసుకుంటున్నట్లయితే మీరు మీ డాక్టర్‌ను సందర్శించకుండానే మీ ప్రిస్కిప్షన్‌ను మీరు రిపీట్‌ చేయవచ్చు. అయితే రెగ్యులర్‌ అవధుల్లో మీరు మీ డాక్టరును మీరు కలవాల్సి ఉంటుంది.మీ అంతట మీరు మీ డోస్‌లను సర్దుబాటు చేసుకోరాదు. పార్శ్వ ప్రభావాలను తగ్గించడానికి అదేవిధంగా అనవసరంగా తీసుకునే మందులను పరిహరించడం కోసం మీరు తరచుగా డాక్టర్‌ను కలుస్తూ ఉండాలి. ఏవైనా పార్శ్వ ప్రభావాలు కలిగినట్లయితే మీరు తక్షణం డాక్టరుకు దీని గురించి తెలియజేయాలి. ఇటువంటి వాటిని చాలా త్వరగా మర్చిపోయే అవకాశం ఉంటుంది కనుక, వీటిని రాసిపెట్టుకోవడం వల్ల లాభం ఉంటుంది. తద్వారా డాక్టరును కలిసినప్పుడు వీటిని గుర్తు తెచ్చుకొని డాక్టరును అడగవచ్చు.


చేయదగినవి మరియు చేయకూడనవి వాటి సారాంశం
  • ఆహారం తీసుకున్న తరువాత లేదా ఆహారంతోపాటు మందులను తీసుకోండి(లేదా పేర్కొనబడిన విధంగా)
  • డూప్లికేషన్‌ తగ్గించడం కోసం అందులో ఉండే పదార్థాలను గమనించండి.రిపీట్‌గా కొనుగోలు చేసే మందుల విషయంలో ఒకే బ్రాండ్‌కు కట్టుబడి ఉండండి.
  • అనవసరమైన మందులను పరిహరించడం కోసం రెగ్యులర్‌గా మీ డాక్టర్‌ను సంప్రదించండి.
  • మందు వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను అర్థం చేసుకోండి. .
  • మెడిసిన్‌ కంటైనర్‌ యొక్క లేబుల్‌ మీద పేర్కొనబడ్డ డోస్‌ కంటే ఎక్కువ డోస్‌ను ఎన్నటికీ తీసుకోవద్దు.
  • మీ యొక్క మందులను ఇతరులతో ఎన్నటకీ పంచుకోవద్దు మీకు ఇక ఏ మాత్రం అవసరం లేనప్పటికీ, మందులను తీసుకోవద్దు.
  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.