OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

శారీరక ఆరోగ్యం


ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ఆరోగ్యకరంగా భుజించడంఆరోగ్యకరమైన ఎముకలుమంచి నిద్రమీ యొక్క దంత సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడంవృద్ధాప్యంలో మంచి చూపుఇమ్యూనైజేషన్చక్కటి వినికిడిఔషధాల నిర్వహణపాదాల సంరక్షణపడటం మరియు ప్రమాదాలుమలబద్ధకం

మూత్ర అసౌకర్యం

ఎక్కువ రక్తపోటు

గుండె జబ్బు

మధుమేహం

ప్రొటెస్ట్ సమస్యలు

ప్రమాదకరమైన వ్యాధులు

స్ట్ర్రోక్

క్యాన్సర్

మానసిక ఆరోగ్యం


న్యూట్రిషన్

రుమటాయిజం మరియు మొబిలిటీ

జాయింట్ల నొప్పులు అనేవి చాలా పెద్ద సంఖ్యలో వయోవృద్ధులను బాధిస్తాయి. జాయింట్ల వద్దనొప్పులు మరియు గట్టిపడటం అనేది మీ చలనంపై తీవ్ర ప్రభావాన్ని కనపరుస్తాయి. మీ రోగలక్షణాల నుంచి ఉపశమనం పొందడం కోసం మీ డాక్టర్‌ నిర్ధిష్ట మందులను మీకు సూచించవచ్చు.ఫిజియో థెరపిస్టు మీకు సాయపడవచ్చు మరియు ఆక్యుపేషనల్‌ థెరపిస్టు మొబిలిటీ ఎయిడ్స్‌కు సంబంధించి మీకు సలహా ఇవ్వవచ్చు. మీడాక్టరు ఈ తరహా సాయం కోసం మిమ్ముల్ని స్థానికంగా ఉన్న ఫిజియో థెరపిస్టు లేదా ఆక్యుపంచర్‌ థెరపిస్టుకు మిమ్ముల్ని సిఫారసు చేయవచ్చు.


మొబిలిటీ ఎయిడ్స్‌

ఒకవేళ మీకు సమస్యలున్నట్లయితే, మీకు ఉపయోగపడేందుకు అనేక రకాల మొబిలిటీ ఎయిడ్స్‌ ఉన్నాయి. మీరు సరైన దానిని ఎంచుకున్నట్లయితే, తద్వారా మీరు మరింత స్వతంత్రతను పొందవచ్చు. వాకింగ్‌ స్టిక్‌ అనేది అతి సరళమైన మొబిలిటీ ఉపకరణం, మీ కాళ్లకు అదనపు సపోర్టు అవసరం అయినప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒకవేళ రెండు కాళ్లకు సపోర్టు అవసరం అయితే, మీరు రెండు వాకింగ్‌ స్టిక్కులు లేదా వాకింగ్‌ ఫ్రేమ్‌ లేదా రోలటర్‌ను ఉపయోగించవచ్చు. నడవడం పూర్తిగా ఇబ్బందిగా ఉన్నట్లయితే, అప్పుడు మీరు వీల్‌ చైర్‌ను ఉపయోగించవచ్చు.


మీ వాకింగ్‌ స్టిక్‌ సరైన పొడవు ఉండేట్లుగా చూసుకోవాలి.దానిని పట్టుకున్నప్పుడు ఆర్మ్‌ క్రీజ్‌తో లెవల్‌ అవ్వాలి. బ్యాలెన్స్‌ ఇవ్వడం కోసం రెండు వాకింగ్‌ స్టిక్కులు ఉపయోగించినట్లయితే, వాటిని మీ ముందు పట్టుకుంటారు కనుక అవి మరింత పొడవుగా ఉండాలి. వాకింగ్‌ స్టిక్‌ యొక్క చివర రబ్బరు ఉండాలి, తద్వారా అది జారిపోకుండా సంరక్షించబడుతుంది. అవి త్వరగా అరిగిపోతాయి, కనుక, వాటిని రెగ్యులర్‌గా చెక్‌ చేస్తూ ఉండాలి. వాకింగ్‌ ఫ్రేమ్‌లు మరింత ఎక్కువ సపోర్టు ఇస్తాయి మరియు నిలకడగా ఉంటాయి, ఇవి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. మధ్యస్థంగా బ్యాలెన్స్‌ సమస్యలు ఉన్నవారికి ఇవి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి.


ఆర్థరైటిస్ మరియు పెయిన్ కిల్లర్లు

ఆర్థిరైటిస్‌ లేదా జాయింట్ల యొక్క వాపు అనేది వృద్ధాప్యంలో సర్వసాధరణంగా కనిపిస్తుంది. వయోవృద్ధుల్లో సర్వసాధారణంగా కనిపించే రుగ్మత ఇది. అనేక రకాల ఆర్థరైటిస్‌లున్నాయి, వీటిలో ఆస్ట్రో ఆర్థరైటిస్‌ అనేది సర్వసాధారణమైనది. ఆస్ట్రో ఆర్థరైటిస్‌ అనేది వాపు పరిస్థితి కాదు, వయస్సు మీద పడటంవల్ల కణజాలాలు క్షీణించడం వల్ల సంభవించే వ్యాధి ఇది. బరువుకు ఎక్కువగా పడే మోకాలి జాయింట్లు,మెడ, వెన్నుతోపాటు చేతుల వద్ద ఈ పరిస్థితి ఉంటుంది. నొప్పి వస్తూ, పోతూ ఉంటుంది మరియు ఇది స్వల్పం నుంచి తీవ్రంగా ఉండవచ్చు. చాలా రకాలై ఆర్థరైటిస్‌కు ఎలాంటి చిక్సిత లేదా నిరోధించలేం.ఆర్థరైటిస్‌ చికిత్స యొక్క లక్ష్యం ఏమిటంటే నొప్పిని తగ్గించడం మరియు వ్యాధిగ్రస్త జాయింట్లలో విధులను పునరుద్ధరించడం


ఆర్థరైటిస్‌ చికిత్సలో నొప్పి తగ్గించడం కోసం విశ్రాంతి, బరువు తగ్గడం, ఫిజియో థెరపీ, ఎక్సర్‌సైజు మరియు డ్రగ్‌ థెరపీ వంటివి అవసరం అవుతాయి. వయోవృద్ధుల్లో ఆర్థరైటిస్‌ మెడిసిన్స్‌ చాలా సర్వసాధారణంగా వినియోగిస్తారు. వీటిలో అన్ని పెయిన్‌ కిలర్లు, నాన్‌ స్టెరాయిడల్‌, యాంటీ ఇన్ఫమేటరీడ్రగ్‌లు(ఎన్‌ఎస్‌ ఎఐడిలు)లు తరచుగా సిఫారసు చేయబడతాయి. ఈ ఔషధాలు శరీరంలో నొప్పిని, బిగుసుకోవడం మరియు వాపు కలిగించే రసాయనాలను ఉత్పత్తినిబ్లాక్‌ చేస్తాయి. ఎన్‌ఎస్‌ఎఐడిలు పనిచేయడానికి కొన్నిరోజుల నుంచి వారాల వరకు పట్టవచ్చు పూర్తి చికిత్స జరిగిన 2 నుంచి 3 వారాల తరువాత మాత్రమే పూర్తి లబ్ధి లభిస్తుంది. సర్వసాధారణంగా ఉపయోగించే ఎస్‌ఎస్‌ఎఐడిలు దిగువ జాబితా చేయబడ్డాయిద. చాలావరకు ఈ పెయిన్‌ కిల్లర్స్‌లో ఒకవిధమైన చర్య మరియు పార్శప్రభావాలుంటాయి.


ఔషధం బ్రాండ్‌ పేరు
  యాస్ప్రిన్‌   Disprin
  నిమిస్యూలైడ్‌   నిమ్యులైడ్‌, నైస్‌
  మికోక్సికామ్‌   మెల్‌ఫామ్‌, మెకామ్‌
  ఇబ్రూఫిన్‌   బ్రూఫిన్‌
  డైక్లోరోఫెన్స్‌   వోవిరాన్‌
  పైరాక్సికామ్‌   పైరాక్స్‌
  పారాసిటోకాల్‌  క్రొసిన్‌, కాల్‌పాల్‌
  సిలోకాజిబ్‌   సెలాక్ట్‌, రివైబ్రా

ఎన్‌ఎఎఐడిల యొక్క పార్శ్వ ప్రభావాలు

బాధానివృత్తితోపాటు ఎన్‌ఎస్‌ఎఐడిలు చాలా మంది వ్యక్తుల్లో తీవ్రమైన పార్శ్వ ప్రభావాలను కలిగిస్తాయి. పొట్టలో అల్సర్లు, గుండె మంట, వికారం, పొట్ట నొప్పి, వాంతులు, డయేరియా మరియు జీర్ణాశయాంతర బ్లీడిరగ్‌ వంటివి చోటు చేసుకుంటాయి.జీర్ణాశయాంతర బ్లీడిరగ్‌లో రక్త వాంతులు లేదా నల్లటి విరేచనం అవుతుంది. ఎన్‌ఎస్‌ఎఐడిల వల్ల తలనొప్పి, తల తిరగడం మరియు చూపు మసకబారడం వంటివి జరుగుతాయి.


మీకు ఈ రోగలక్షణాలు కనిపించినట్లయితే మీరు తక్షణం మీ డాక్టర్‌కు ఈ విషయాన్ని నివేదించాలి. పార్శ్వ ప్రభావాలను కనిష్టం చేయడం కోసం చికిత్సను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. పార్శ్వ ప్రభావాలను కనిష్టం చేయడం కోసం ఎన్‌ఎస్‌ఎఐడిలను ఆహారం తీసుకున్న తరువాత తీసుకోవాలి. యాంటీ అల్సర్‌ డ్రగ్‌, ఒమ్రిప్రజోల్‌( ఒమేజ్‌, యాసిడ్‌, ప్రోటోలాక్‌) వంటి పొట్టలోని అల్సర్లను తగ్గిస్తాయి. పొగ తాగేవారు మరియు మద్యం తాగేవారిలో ఎన్‌ఎస్‌ఎఐడి ద్వారా ఏర్పడే సమస్యలు చాలా సర్వసాధారణం.


కార్టికో స్టెరాయిడ్‌

కొన్నిరకాల ఆర్థరైటిస్‌లో కార్టికోస్టెరాయిడ్‌లు వాపును తగ్గిస్తాయి. వీటిని నోటి ద్వారా తీసుకోవచ్చు లేదా నొప్పి ఉన్న జాయింట్ల ప్రాంతంలో ఇంజెక్షన్‌ ద్వారా ఇవ్వవచ్చు. కార్టికోస్టెరాయిడ్లు వాపును వేగంగా తగ్గించి, తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనాన్నికలిగిస్తాయి.


కార్టికోస్టెరాయిడ్‌ల వల్ల తీవ్రమైన పార్శ్వ ప్రభావాలుంటాయి, వీటిలో సంక్రామత్యను నిరోధం తగ్గిపోవడం, జీర్ణక్రియ మందగించడం, బరువు పెరగడం, కండర శక్తి తగ్గిపోవడం, మూడ్‌ మారడం, చూపు మసకబారడం,క్యాటరాక్ట్‌,డయాబెటిస్‌, ఎముకలు పెళుసుగా మారడ,రక్తపీడనం వంటివి చోటు చేసుకుంటాయి.

కార్టికోస్టెరాయిడ్‌లు అనేవి ఎంతో ఉపయుక్తమైన ఔషధాలు అయితే వీటిని వైద్య పర్యవేక్షణలో తీసుకోవాలి. .


రుజువు చేయని చికిత్సలు

దీర్ఘకాలిక ఆర్థరైటిస్‌కు గురైన వ్యక్తులు తరచుగా ఇతర వైద్యవిధానాలపైదృష్టి సారిస్తుంటారు. అనేక రకాల మాత్రలు, పరికరాలు, మరియు డైట్‌లు ఆర్థరైటిస్‌కు చికిత్స జరపడం కోసం సిఫారసు చేయబడ్డాయి.ఆర్థరైటిస్‌ నొప్పి వస్తూ, పోతూ ఉంటుంది కనుక, ఇలాంటి చికిత్సల వల్ల నిజంగానే నయం అయిందని చాలామంది అనుకుంటారు. ఆర్థరైటిస్‌కు సంబంధించి అద్భుతాలు జరుగతాయనే మాత్రలు మరియు పరికరాల గురించి కాస్తంత జాగ్త్రతగా ఉండండి, ఎందుకంటే ఆర్థరైటిస్‌ అనేది చికిత్స లేని వ్యాధి.

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.