OLD AGE SOLUTIONS

Portal on Technology Initiative for Disabled and Elderly
An Initiative of Ministry of Science & Technology (Govt. of India)
Brought to you by All India Institute of Medical Sciences

పెద్దవారికి డిజైన్ మరియు వాతావరణం

అంగవైకల్యం ఉన్న పెద్దవారికి స్వేచ్ఛా వాతావరణానికి అడ్డంకి

పెద్దవారికి డిజైన్ మరియు వాతావరణం

భవంతులు నిర్మించేటప్పుడు సాధారణ, ఆరోగ్యవంతమైన మరియు చురుగ్గా ఉన్న వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని నిర్మిస్తుంటారు. భవన నిర్మాణశాస్త్రవేత్తలు కూడా మనందరం కొంతకాలానికి ముసలి వారమై పోతామన్న విషయాన్ని గుర్తుంచుకోరు.ఇటీవల కాలంలో వైద్యసాంకేతికత గణనీయంగా వృద్ధి చెందడాన్ని మనం చూశాం. ఇది ప్రపంచం యొక్క భౌతిక చిత్రంపై తీవ్రమైన మార్పును కనపరిచింది. అతి త్వరలోనే మనకు వయోవృద్ధుల యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మరియు భౌతిక నిర్మాణాలన్నీ కూడా వారికి అవరోధాలుగా నిలుస్తున్నాయి. ఈ అడ్డంకులు వృద్ధులపై తీవ్రమైన ప్రభావాలను కనపరుస్తాయి. వారు తమ భౌతిక కార్యక్రమాలు తాము చేసుకోకుండా అడ్డగిస్తాయి మరియు ఇతరులపై ఆధారపడే విధంగా చేస్తాయి. అడ్డంకులు లేని వాతావరణాన్ని వారికి సృష్టించడం అనేది ఎంతో అత్యవసరం అని భావించాలి.అడ్డంకులు వల్ల వృద్ధులు పరిసర వాతావరణంలో పాల్గనడం మరియు ఆస్వాదించడం లేకపోవడం అనేది లేకుండా చూడాలి.

అడ్డంకులు లేని నిర్మాణాలను రూపొందించాలి మరియు ఫంక్షనల్‌, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన భవన వాతావరణాలను వృద్ధులకు నిర్మించేటప్పుడు నిర్ధిష్ట డిజైన్‌ సూత్రాలను పాటించాలి. ప్లానింగ్‌ చేసేటప్పుడు పాటించాల్సిన సిద్ధాంతాలు ఇలాఉంటాయి.

  • యాక్సెసబిలిటీ
    యువకులు, వృద్ధులు మరియు విభిన్న వయస్సు గ్రూపు ఉన్న వారు ఉపయోగించే విదంగా అన్ని వాతావరణాలను డిజైన్‌ చేయాలి.
  • చేరుకోవడం
    యువకులు, వృద్ధులు మరియు విభిన్న రకాలు వారు చేరుకునేవిధంగా నిర్మించబడ్డ వాతావరణంలో ఏర్పాట్లను కల్పించాలి.
  • వినియోగించడం
    అన్ని రకాల వ్యక్తులు ఉపయోగించే విధంగా నిర్మిత వాతావరణం డిజైన్‌ చేయబడాలి.
  • ఓరియంటేషన్‌
    అన్ని నిర్మిత వాతావరణాల్లోకి ఎంతో తేలికగా ప్రవేశించి, నిష్క్రమించేవిధంగా ఉండాలి. భవంతి నుంచి అందరూ కూడా మరిముఖ్యంగా ఆకస్మికంగా ప్రమాదాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఖాళీ చేయించే విధంగా ఉండాలి.
  • పనిచేయడం
    వయోవృద్ధులు తమంతట తాము పనిచేసుకునేవిధంగా ఉండేందుకు దోహదపడే అన్ని రకాల సిద్ధాంతాలను డిజైన్‌లో అమలుచేయాలి.
  • రక్షణ
    జీవితానికి మరియు ఆరోగ్యానికి ఎలాంటి విపత్తు లేకండా ప్రతి ఒక ఒక్కరూ తిరగగలిగే విధంగా ఉండే సురక్షితమైన వాతావరణాన్ని డిజైన్‌ చేయాల్సి ఉంటుంది.

సున్నితమైన డిజైన్‌ వాతావరణం అనేది, వయోవృద్ధులు తాము స్వతంత్రులు అనే భావనను కలిగిస్తుంది. కనుక ఇన్‌డోర్‌ మరియు అవుట్‌ వాతావరణాలను నిర్మించేటప్పుడు, ప్రతి ఒక్కరి సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రెండు రకాల వాతావరణాల మధ్య చక్కటి సమన్వయాన్ని ఏర్పరచడం ద్వారా, వయోవృద్ధులు తాము ఎంతో స్వతంత్రులని భావిస్తారు.ఈ విధంగా అడ్డంకులు లేని వాతావరణం అనేది, వయస్సు సమీకృత సమాజం మరియు అన్ని వయస్సుల వారి సమాజానికి అవసరమైన వ్యక్తిగత వాతావరణాన్ని పున:స్థాపన చేస్తుంది.

మనం అందరం కాస్త అటూ ఇటూగా ఎప్పుడో ఒకప్పుడు వృద్ధాప్యాన్ని చవిచూస్తాం. వృద్ధాప్య ప్రక్రియను ప్రభావం చూపే అనేక కారకాలుంటాయి. వాటిలో:

  • ప్రాథమిక కారకాలు
    జన్యు లేదా వారసత్వ జీవ కారకాలు, పుట్టుకతో వచ్చే సమస్యలు, వారసత్వంగా లేదా కుటుంబ పరంగా వచ్చే వ్యాధులు అయిన మధుమేహం వంటివి ఎముకలు, శక్తి, దృష్టి వంటి కొన్ని సమస్యల్ని కలిగిస్తాయి.
  • ద్వితీయ కారకాలు
    కలుషిత వాతావరణం మరియు ప్రమాదకరమైన పనిప్రాంతాలు అనేవి శ్వాసించడం, వినడం మరియు ఆకృతిపై ప్రభావాలను చూపిస్తాయి.
  • భౌతిక కారకాలు
    శక్తిని కోల్పోవడం, కదలడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం,వృద్ధుల్లో జీవక్రియ మందగించడం అనేది వారి రోజువారీ కార్యక్రమాలపై ప్రభావం చూపుతుంది.ఆపుకోలేకపోవడం అనేది, దృష్టిసారించాల్సిన ప్రధాన సమస్య.
  • మానసిక కారకాలు
    ఆర్థిక వనరులు కోల్పోవడం, రిటైర్‌మెంట్‌ తరువాత పనిని కోల్పోవడం, జీవితభాగస్వామిని లేదా స్నేహితులను కోల్పోవడం వంటివి వృద్ధాప్యంలో తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి.

అడ్డంకులు లేని వాతావరణాన్ని నిర్మించడం కొరకు డిజైన్‌ సూత్రాలు

ప్రవేశం మరియు నిష్క్రమణ:

ప్రతి భవంతి యొక్క ప్రవేశం మరియు నిష్క్రమణ ఎంతో సులభంగా ఉండేవిధంగా ఉండాలి. రోడ్డు నుంచి ఇవి ఎంతో సులభంగా కనిపించేట్లుగా ఉండాలి. ఒకవేళ ప్రవేశ లాబీ, రోడ్డు లెవల్‌ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, ర్యాంప్‌ను కల్పించాల్సి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ ఫ్లోర్లు ఉన్న భవంతులకు సౌకర్యవంతమైన మెట్లతోపాటు ర్యాంపులు లేదా ఎలివేటర్లు ఏర్పాటు చేయాలి.


ర్యాంపులు:

వయోవృద్ధులైన పెద్దవారు భవంతి లోపలికి నడిచిలేదా వీల్‌ చైయిర్‌ ద్వారా లోపలికి రావడానికి అదేవిధంగా బయటకు వెళ్లడానికి ర్యాంపు సాయపడుతుంది. ర్యాంపు యొక్క గ్రాడ్యుయెంట్‌ 1:12 మించి ఉండరాదు. కనిష్ట వెడల్పు 120 సెంటీమీటర్లు మరియు గరిష్ట వెడల్పు 6 మీటర్ల వరకు ఉండాలి. అదేవిధంగా 180 సెంమీ ల్యాండిరగ్‌ను కల్పించాలి. ఇరువైపులా 10 సెంమీ హై కర్బ్స్‌తోపాటు హ్యాండ్‌ రైల్స్‌ను కల్పించాలి.


డోర్లు:

అన్ని డోర్లు కూడా కనీసం 80 సెంమీ వెడల్పు కలిగి ఉండలి మరియు వీల్‌ చెయిర్‌ లేదా వాకర్‌ దాటివెళ్లేవిధంగా ఉండాలి.డోర్ల యొక్క ముందు మరియు వెనక వైపు 150 150 సెంమీ లెవల్‌ స్పేస్‌ కలించాలి. మృదువుగా ఉపయోగించే విధంగా ఉండే మెటీరియల్‌తో తయారుచేయబడ్డ తలుపులు మరియు కిటికీలు వినియోగించాలి. డోర్లు మరియు కిటికీలు తెరవడం మరియు మూయడం కోసం రిస్ట్‌ మూవ్‌మెంట్‌ లేదా వెళ్లను కదలించాల్సిన అవసరం లేకుండా ఉండాలి. లీవర్‌ టైపు హ్యాండిల్స్‌ ఎంతో ఉపయుక్తమైనవి.


మెట్లు:

150 సెంమీ నుంచి 300 సెంమీ ఎత్తులు ఉన్నవాటిలో వయోవృద్ధులు ఎక్కడం మరియు దిగడం కొరకు మెట్లను నిర్మించడం ఉపయుక్తం. మెట్లకు ఇరువైపులా రైలింగ్‌లు ఏర్పాటు చేయడం వల్ల, వారు తేలికగా కదలడానికి అవకాశం ఏర్పడుతుంది,ట్రయాంగల్‌ ట్రెండ్స్‌ను పరిహరించాలి, ఎందుకంటే తిరిగేటప్పుడు అది వారికి ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఒపెన్‌ రైజర్లు మరియు ప్రొజెక్టింగ్‌ నోసింగ్‌ల వల్ల వృద్ధులు జారిపడటానికి లేదా వారి యొక్క చేతి కర్ర దానిలో చిక్కుకు పోవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి.వంపుగా ఉన్న రైజర్లు ఉపయుక్తమైనవి. ట్రెండ్‌లు జారిపడిపోకుండా నిరోధించేవిధంగా ఉండాలి. దృష్టిలోపల ఉన్న వృద్ధులు తేలికగా గుర్తించేవిధంగా ట్రెండ్‌లు మరియు రైజర్లు ఉండాలి.


ప్యాసేజీలు:

పబ్లిక్‌ ప్రాంతంలో నడిచే మార్గాల్లో ఉండే లెవల్స్‌ను మార్చాలి. ఈ నడిచే మార్గాల్లో నిరంతర ఉపరితలం ఉండాలి మరియు వీల్‌ చెయిర్‌ ద్వారా ఒక వ్యక్తి ప్రయాణించేవిధంగా ఉండాలి. విరామాల వద్ద వెడల్పుగాను ఉండి, మరో వీల్‌ చెయిర్‌ వెళ్లేవిధంగా అనుమతించాలి. బిల్డింగ్‌లోని ప్యాసేజీలు మరియు కారిడర్లతోపాటు, గార్డెన్లు మరియు పార్కుల్లోని పాత్‌వేల్లో రైలింగ్‌లు ఉపయోగించాలి. ఫ్లోర్లు మరియు పేవ్‌మెంట్‌ ప్రాంతాల యొక్క అంచుల్లో స్పష్టమైన బోర్డరు ఉండాలి. దృష్టిలోపం ఉన్న వయోవృద్ధులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది..


బిల్డింగ్‌ యొక్క లేవుట్:

బిల్డింగ్‌కు చక్కటి కాంతి మరియు వెలుతురు వచ్చే విధంగా ఉండాలి. ఏ బిల్డింగ్‌ యొక్క లేవుట్‌ అయినా ఎంతో సింపుల్‌గా ఉండాలి. వారిలో జ్ఞాపకశక్తి నెమ్మదిస్తూ ఉంటుంది. తఅందువల్ల, వారు తమ పరిసరాలను త్వరగా మర్చిపోతూ ఉంటారు. వయోవృద్ధులు తాము నడిచే మార్గాన్ని ఎంతో తేలికగా గుర్తించే విధంగా ఉండాలి. చిందరవందరగా ఉండే రూమ్‌లు, గార్డెన్లు, దుమ్ముధూళితో ఉన్న రగ్గులు, ఫుట్‌ మ్యాట్‌లు,గందరగోళంగా ఉన్న గార్డెన్‌ మరియు స్ట్రీట్‌ పోస్ట్‌లు వంటివి వయోవృద్ధులు జారిపడటానికి మరియు వారు గాయపడేందుకు కారణం అవుతాయి.వ్యక్తిగత మరియు ప్రజా టాయిలెట్లు వయోవృద్ధులకు అసౌకర్యం కలిగించకుండా రూపొందించాలి.


టాయిలెట్లు:

టాయిలెట్లు: భవంతిలో కనీసం ఒక్క టాయిలెట్‌లో వాకర్‌ లేదా వీల్‌ చెయిర్‌ వినియోగదారుడు ప్రవేశించేవిధంగాను మరియు డోర్‌ను మూసి,వాటర్‌ క్లోజట్‌ సీట్‌మీదకు ఆ వ్యక్తిని బదిలీ చేసేవిధంగా ఉండాలి. టర్నింగ్‌ స్పేస్‌ 2.2.5 చదరపు మీటర్లతోపాటు వీల్‌ చైయిర్‌ కదలడం కోసం కనీసం 150 సెంమీ స్థలాన్నికల్పించాలి. వాటర్‌ క్లోజట్స్‌,యూరినల్స్‌ర, వాష్‌ బేసిన్లు మరియు షవర్‌ ప్రాంతాలు మరియు వయోవృద్ధులు తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకునేందుకు సాయపడే ఇతర ప్రాంతాల్లోనూ గ్రాబ్‌ బార్లను ఉంచాలి. టాయిలెట్‌లో ఉన్న ప్రతి ఉపకరణాన్ని వీల్‌ చెయిర్‌లో ఉన్న వ్యక్తి అందుకునేవిధంగా ఉండాలి. టాయిలెట్‌లో ఉన్న ఫ్లోర్‌,కిచెన్‌లో తరహాలో జారిపోకుండా ఉండాలి. షవర్‌ ప్రాంతంలో, జారిపడకుండా ఉండటాన్ని పరిహరించడం కోసం రబ్బర్‌ మ్యాట్ల వినియోగం తగ్గించాలి.


లైటింగ్‌:

ప్రతి భవంతికి సరిపడినంత సహజ కాంతి లభించే విధంగా ఉండాలి. పగటి పూట తీష్ణమైన సూర్యకాంతి లోపలికి ప్రవేశించకుండా కిటికీలకు షేడ్లను అమర్చాలి. రాత్రివేళల్లో మరింత వెలుతురు ప్రాంతాలకు మరియు అదేవిధంగా మరింత చీకటి ప్రాంతాలకు మధ్య తేడా లేకుండా చూసుకోవాలి. లేనిపక్షంలో అంత చక్కటి దృష్టిజ్ఞానం లేని వయోవృద్ధులు చీకటిలో నుంచి ఒక్కసారి వెలుతురు లోకి వచ్చినా, వెలుతురులో నుంచి చీకటిలోకి వెళ్లినా, దానికి అనుగుణంగా వారు తమ కంటిని సర్దుబాటు చేసుకోలేకపోతారు. విద్యుత్‌ స్విచ్‌లకు భిన్నమైన రంగుల్ని వాడటం వల్ల వయోవృద్ధులు వాటిని ఎంతో తేలికగా గుర్తించగలుగుతారు.


శుభ్రత మరియు భద్రత:

వయోవృద్ధుల్లో రోగనిరోధక శక్తి క్షీణించి ఉంటుంది, నునుపైన గోడలు ఉండటం వల్ల వ్యాధులు సంక్రమించడానికి కారణం అయ్యే దుమ్మును తగ్గిస్తుంది. అదేవిధంగా గోడలు, తలుపులు, కిటీలు మరియు ఫర్నిచర్‌కు సంబంధించి గుండ్రంగా ఉండే అంచుల ద్వారా వయోవృద్ధులు తక్కువగా గాయపడే అవకాశం ఉంటుంది.


ధ్వని:

చాలా మంది పెద్దవారికి వినికిడి శక్తి క్రమేపీ క్షీణిస్తూ ఉంటుంది. కర్టెన్లు, తివాచీలు, దూదిలాంటి బట్టలు, గోడలకు పట్టీలు వంటి వాటిని ధ్వనిని శోషించుకునే మెటీరియల్స్‌ను ఉపయోగించడం ద్వారా ప్రతిధ్వనులను గరిష్టంగా తగ్గించవచ్చు, తద్వారా పెద్దవారు ఎంతో తేలికగా ప్రతిదీ వినగలుగుతారు.


కళారాధన:

కళారాధన: అడ్డంకుల్ని లేని వాతావరణాన్ని సృష్టించడంతోపాటు, పరిసరాలను ఎంతో చక్కగా, కళాత్మకంగా, పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది కూడా ఎంతో ముఖ్యం. ఇది వయోవృద్ధుల్లో మానసిక ఆందోళనల్ని అద్భుతంగా తగ్గిస్తుంది.


సంక్షిప్తీకరిస్తే:

డిజైన్‌ను అర్థం చేసుకోవడంతోపాటు, నిర్మాణ వ్యయాలకు పెంచుకుండా, అడ్డంకులు లేని వాతావరణాన్ని సృష్టించడం ఎంతో ముఖ్యం. అడ్డంకులు లేని వాతావరణం సృష్టించడం కోసం ఈ సిద్ధాంతాలను పాటించడం ద్వారా, ఎప్పుడో ఒకప్పుడు వృద్ధులుగా మారే మనందరం కూడా లాభం పొందుతాం

  Copyright 2015-AIIMS. All Rights reserved Visitor No. - Website Hit Counter Powered by VMC Management Consulting Pvt. Ltd.